అక్షరటుడే, ఇందూరు: TUCI | కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు పెంచాలని టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ (Vanamala Krishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ (Collectorate) ముందు గురువారం టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కనీస పెన్షన్ రూ.9వేలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కార్మికులకు తక్కువ వేతనాలు ఉండడం సిగ్గుచేటన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం(KCR Government) కార్మికులను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అదే ధోరణిలో ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, సుధాకర్, ఉపాధ్యక్షులు వెంకన్న, రాజేశ్వర్, మల్లేష్, మురళి, కిరణ్, రవి, హేమలత, సుమలత, శారద, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.