అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) 25 సుంకాలు (Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత ఉత్పత్తులపై రేపటి నుంచి సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Ganhdi) కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అయితే తాజాగా కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కుమారుడు కార్తీ చిదంబరం (Karti Chidambaram) కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సుంకాలపై అప్పుడే భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు చేసిన ప్రకటనపై కార్తీ చిదంబరం గురువారం స్పందించారు. ట్రంప్ సంప్రదాయ రాజకీయ నాయకుడు కాదని ఆయన పేర్కొన్నారు. సాధారణ దౌత్య ప్రొటోకాల్స్, అంతర్ ప్రభుత్వ సంబంధాల సాధారణ నియమాలు అతడి దగ్గర పనిచేయవు అన్నారు. ఆయన అసాధారణమైన వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే సుంకాలపై మనం భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడ్డారు. ఇవన్నీ చర్చల్లో ప్రారంభ స్థానాలు అని తెలిపారు. ప్రభుత్వం ప్రశాంతంగా ఉంటుందని, చర్చలు కొనసాగించి, అమెరికాతో (America) అవగాహనకు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.