- Advertisement -
HomeతెలంగాణRTC Banswada | ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

RTC Banswada | ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: RTC Banswada | ఆర్టీసీ డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాన్సువాడ (Banswada) పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఆర్టీసీ డిపో (RTC Depot)లో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్​ గంగాధర్​ మంగళవారం గడ్డిమందు తాగాడు.

అనంతరం డిపోకు చేరుకుని తనకు న్యాయం చేయాలని తోటి సిబ్బందితో మాట్లాడుతుండగా సృహతప్పి పడిపోయాడు. వెంటనే వారు అతడిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి (Banswada Area Hospital) తరలించారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో నాలుగు రోజులుగా తాను సెలవులో ఉన్నానని గంగాధర్​ తెలిపారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోగా సెలవుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే మనస్థాపంతో గడ్డిమందు తాగినట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News