అక్షరటుడే ఇందూరు: Mla Dhanpal | ప్రజా అవసరాల నిమిత్తం కమ్యూనిటీ హాల్ (Community Hall) నిర్మించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Danpal Suryanarayana Gupta) అన్నారు.
నగరంలోని ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ అసోసియేషన్ (Old NGOS Colony Association) ఆధ్వర్యంలో గురువారం కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తులో కాలనీలో ఆయా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ కృష్ణ, కొండ ఆశన్న, ఇల్లెందుల ప్రభాకర్, కాలనీవాసులకు పాల్గొన్నారు.