ePaper
More
    HomeజాతీయంPahalgam terror attack | పహల్​గామ్​ ఉగ్రదాడిలో పాక్ మాజీ జవాన్.. ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి

    Pahalgam terror attack | పహల్​గామ్​ ఉగ్రదాడిలో పాక్ మాజీ జవాన్.. ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pahalgam terror attack | పహల్​గామ్​ ఊచకోత వెనుక ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాది హషీమ్ ముసా(Terrorist Hashim Musa) గతంలో పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్(Pakistan Army Special Forces)​లో మాజీ పారా కమాండోగా పని చేసినట్లు దర్యాప్తులో తేలింది.

    పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)తో ముసా చేతులు కలిపాడని వెల్లడైంది. కాశ్మీర్​కు వచ్చే స్థానికేతరులు, భద్రతా దళాలపై దాడులు చేయాలన్న నిర్దిష్ట లక్ష్యంతో మూసాను ఎల్ఈటీ కాశ్మీర్​కు పంపిందని నిఘా వర్గాలు గుర్తించాయి. “స్పెషల్ సర్వీస్ గ్రూప్(SSG) వంటి పాకిస్తాన్ ప్రత్యేక దళాలు అతన్ని ఎల్ఈటీ(LET)కి అనుబంధంగా పని చేయమని చెప్పి ఉండవచ్చని” భద్రతా సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

    SSG పారా-కమాండోలు అసాధారణ యుద్ధంలో అత్యంత కఠిన శిక్షణ పొందారు. రహస్య కార్యకలాపాలలో వారికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. స్థానికుల్లో కలిసి పోవడం, దాడి చేసి క్షణాల్లో మాయం కావడం, ప్రతికూలతను ఎదుర్కొంటూ అవకాశాలు సృష్టించుకోవడంలో వారికి శిక్షణ ఇస్తారు. SSG కమాండోలు అధునాతన ఆయుధాల వాడకంలో శిక్షణ పొందారు.

    Pahalgam terror attack | పాకిస్తాన్ పాత్ర నిర్ధారణ..

    పహల్​గామ్​ దాడి(Pahalgam terror attack) దర్యాప్తులో కీలక అనుమానితులుగా తేలిన 15 మంది కాశ్మీర్ ఓవర్​ గ్రౌండ్​ వర్కర్స్ (OGWs) ను ప్రశ్నించినప్పుడు, ముసా పాకిస్తాన్ ఆర్మీ నేపథ్యం బయటకు వచ్చిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వారు పాకిస్తాన్ దుండగులకు లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడంతో భద్రతా బలగాల కదలికలపై సమాచారం ఇచ్చారన్నారు. పహల్​గామ్​ ఉగ్రవాద దాడిలో ISI పాత్రకు, కాశ్మీర్​లో మునుపటి దాడులకు ఇది సాక్ష్యంగా మారిందన్నారు. అక్టోబర్ 2024లో గంగాంగిర్, గండర్బాల్లో జరిగిన ఉగ్ర దాడుల్లో 6 మంది స్థానికేతరులు, ఒక డాక్టర్ మరణించారు.

    బుటా పత్రి, బారాముల్లా(Baramulla)లో జరిగిన ఉగ్రవాద దాడులు ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ఇద్దరు ఆర్మీ పోర్టర్లు(Army porters) మరణించారు. ఈ మూడు దాడులలోనూ మూసా హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్​లో శిక్షణ పొందిన మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు జునైద్ అహ్మద్ భట్, అర్బాజ్ మీర్ కూడా గగంగీర్ బూటా పత్రి దాడుల్లో పాల్గొన్నప్పటికీ, 2024 నవంబర్, డిసెంబర్లలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లలో హతమయ్యారు. అప్పటి నుంచి కాశ్మీర్​లోని స్థానికేతరులను లక్ష్యంగా చేసుకునే మూసా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.

    More like this

    Indian origin man beheaded | అంత కసినా.. అమెరికాలో భారత సంతతి తల నరికి.. విసిరేశాడు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian origin man beheaded : అమెరికా America లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది....

    Lorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్

    అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్...

    Political crisis in Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. మోడీ లాంటి బలమైన నాయకుడిని కోరుకుంటున్న యువత

    Political crisis in Nepal : నేపాల్‌లో Nepal రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. జెన్‌ జెడ్‌ యువతరం...