NEET Exam
NEET Exam | నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: NEET Exam | జిల్లాలో నీట్ పీజీ ఎంట్రెన్స్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

జిల్లా కేంద్రంలో, ఆర్మూర్​ సబ్ డివిజన్ (Armur Sub division) పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు ఆయన వివరించారు. ఆగస్టు 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.

NEET Exam | పరీక్ష కేంద్రాల వద్ద..

పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశామని సీపీ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అండర్ సెక్షన్ 163 బీఎన్​ఎస్ (Under Section 163 BNS)​ అమలులో ఉంటుందన్నారు. ఈ సెక్షన్ ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడి ఉండరాదని వివరించారు.

అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్లను ఆగస్టు 3వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసిఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.