Additional Collector Ankit
Additional Collector Ankit | వైద్యులు అందుబాటులో ఉండాలి

అక్షరటుడే, భీమ్​గల్: Additional Collector Ankit | ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్​ అంకిత్​ అన్నారు. భీమ్​గల్ (Bheemgal)​ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Primary health center) ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Additional Collector Ankit | పీహెచ్​సీ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి..

ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాలను సబ్​కలెక్టర్​ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పీహెచ్​సీలో (PHC) అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయో లేదా అనే విషయాలను ఫార్మసిస్ట్​ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో సంతోష్ కుమార్ డాక్టర్ అజయ్ పవార్, సిబ్బంది ఉన్నారు.