ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Commission | ప్రభుత్వానికి విచారణ నివేదిక సమర్పించిన కాళేశ్వరం కమిషన్

    Kaleshwaram Commission | ప్రభుత్వానికి విచారణ నివేదిక సమర్పించిన కాళేశ్వరం కమిషన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ విచారణ నివేదికను గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్​ విచారణ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో మరో మూడు రోజులు గడువు పొడిగిస్తారని ప్రచారం జరిగింది. అయితే కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​(Commission Chairman PC Ghosh) గడువులోగా తుది నివేదికను అందించారు. గురువారం ఉదయం ఆయన నివేదికను నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జాకు (Rahul Bojja) సమర్పించారు. ఆయన దానిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు (Ramakrishna Rao) అప్పగించనున్నారు.

    Kaleshwaram Commission | సుదీర్ఘ విచారణ

    కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయాని కాంగ్రెస్​, బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్​ పేరిట కేసీఆర్​ కుటుంబం రూ.కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించాయి. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్​లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. కొన్ని పియర్స్​ దెబ్బతిన్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ 2024 మార్చి 14న జస్టిస్​ పీసీ ఘోష్​ ఛైర్మన్​గా కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపిన కమిషన్​ తాజాగా నివేదిక సమర్పించింది.

    READ ALSO  Sriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. పెరుగుతున్న నీటిమట్టం

    Kaleshwaram Commission | 115 మందిని విచారించిన కమిషన్​

    కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అక్రమాలు, డిజైన్​ మర్పు, నిధుల విడుదల, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ మార్పు ఎందుకు చేశారని కమిషన్​ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో కీలకంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నించింది. దాదాపు 115 మందిని కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​ విచారించారు. మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​ను సైతం కమిషన్ ప్రశ్నించింది. వారందరి వాంగ్మూలాలు రికార్డు చేసింది. ఈ మేరకు తుది నివేదికను సిద్ధం చేసి ఇరిగేషన్​ శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జాకు కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​ సమర్పించారు.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this