Deputy CM Pawan Klayan
Deputy CM Pawan Klayan | మ‌రోసారి గిరిజ‌నుల ప‌ట్ల ప్రేమ చాటుకున్న ప‌వ‌న్ .. ఈ సారి ఏ సాయం అందించారంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deputy CM Pawan Klayan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల తన ఆప్యాయతను, సానుభూతిని మరోసారి చాటుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లోని మొక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు అవసరమైన రగ్గులను పంపించి సాయంగా నిలిచారు.

స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వారి అవసరాల మేరకు సహాయం చేయడం పవన్‌ కళ్యాణ్‌కి (Deputy CM Pawan Klayan) అలవాటే అని స్థానికులు ప్రశంసిస్తున్నారు. జిల్లా పీడీ రామచంద్రరావు తెలిపిన సమాచారం మేరకు.. పవన్ పంపిన రగ్గులను సిరివర, బాగుజోల, చిలకమెండంగి, బండమెండంగి, డొయివర, తాడిపుట్టి వంటి గ్రామాల్లోని 222 కుటుంబాలకు పంపిణీ చేశారు.

Deputy CM Pawan Klayan | మాన‌వ‌తా విలువ‌లు..

గతంలో పవన్ కళ్యాణ్ మొక్కపల్లి మండలంలో (Mokkapalli Mandal) జరిగిన పల్లె పండుగ కార్యక్రమానికి హాజరై, ప్రత్యక్షంగా ప్రజల అవసరాలను తెలుసుకున్నారు. అప్పటి నుంచి వారి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ అరకులోయ నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామస్థులకు చెప్పులు పంపించి తన మానవతా దృక్పథాన్ని చాటారు. తాజాగా, అదే మండలంలోని కురిడి గ్రామానికి తన సొంత తోటలో పండించిన ఆర్గానిక్ మామిడి పండ్లను (Organic Mangoes) బహుమతిగా పంపించి, ప్రతి కుటుంబానికి అందించారు. ఈ సాయం చూసి కురిడి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. “పవన్ బాబు పది కాలాలపాటు చల్లగా ఉండాలి” అంటూ ఆశీస్సులు అందించారు.

మంత్రి హోదాలో ఉన్నప్పటికీ, మారుమూల గిరిజన గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారి సంక్షేమం కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా చేయూత ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ ముందుంటున్నారు. ఆయన చూపుతున్న ఈ ఆప్యాయ‌త‌ గిరిజనుల్లో (Tribals) అభిమానం, నమ్మకాన్ని పెంచుతోందని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం, చలికాలం సమయంలో రగ్గులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గిరిజ‌నులు చెప్పుకొస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గిరిజన గ్రామాల పట్ల చూపుతున్న శ్రద్ధ, సానుభూతి ప్రజల్లో విశేష స్పందన తెచ్చిపెడుతోంది. ఇలాంటి నాయ‌కుడే మాకు కావాలని వారు కోరుకుంటున్నారు.