అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. బుధవారం భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. లడఖ్‌లలో (Ladakh) భారీ వరదలకు రెండు ఘటనల్లో లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు ఉపాధ్యాయులు సహా ఇద్దరు సైనికులు మరణించారు.
బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో డర్బుక్ నుంచి చోంగ్‌టాష్ మధ్య కాన్వాయ్ కదలికలో ఆర్మీ వాహనంపై (Army Vehicle) బండరాయి పడింది. వరదల కారణంగా రాయి కొండపై నుంచి జారి పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందారు. మృతులను లెఫ్టినెంట్ కల్నల్ భాను ప్రతాప్ సింగ్, లాన్స్ దఫాదర్ దల్జీత్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటనలో మేజర్ మయాంక్ శుభమ్, మేజర్ అమిత్ దీక్షిత్, కెప్టెన్ గౌరవ్ గాయపడ్డారు.
Jammu Kashmir | కొట్టుకుపోయిన బైక్
జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) బటోట్‌లో 12 గంటల్లో కుండపోత వాన కురిసింది. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. జలేబీ మోర్హ్ నల్లా(Jalebi Morh Nallah) సమీపంలో ఒక మోటార్ సైకిల్ వరదల్లో కొట్టుకుపోయింది. ఉధంపూర్ జిల్లాలోని ఘోర్డి బ్లాక్ నివాసితులు జగదేవ్ సింగ్ ఠాకూర్, సంజయ్ శర్మ అనే ఇద్దరు ఉపాధ్యాయులు ఈ ఘటనలో మరణించారు.