Kingdom Movie Review
Kingdom Movie Review | కింగ్‌డ‌మ్ మూవీ రివ్యూ.. విజ‌య్ ఖాతాలో సాలిడ్ హిట్ ప‌డ్డ‌ట్టేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kingdom Movie Review | విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లోనే కాదు ఇత‌ర ఇండ‌స్ట్రీస్‌లోనూ విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య కాలంలో విజ‌య్ నుండి వ‌చ్చిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రుస్తున్నాయి. దీంతో ఆయ‌న తాజా చిత్రం కింగ్‌డ‌మ్‌పై భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, స‌గ‌టు ప్రేక్ష‌కుడిని అల‌రించిందా లేదా అనేది చూద్దాం.

Kingdom Movie Review | కథ

కింగ్ డ‌మ్ చిత్రం(Kingdom Movie)లో సూరి(విజయ్ దేవరకొండ) అనే ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోని ప‌రిస్థితుల‌లో అండర్ కవర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న శ్రీలంక‌లోని ఒక జైల్లో ఉండాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. సూరి అన్నయ్య శివను (సత్యదేవ్) వెతుక్కుంటూ వెళ‌తాడు. ఆ స‌మ‌యంలో త‌న అన్న‌య్య గ్యాంగ్ స్టర్ అని తెలుస్తుంది. అస‌లు ఎటువంటి పరిస్థితుల్లో శివ గ్యాంగ్ స్టర్ అయ్యాడు? వాళ్ల అన్నయ్యను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సూరి.. పోలీసులతో పెను యుద్ధం ఎందుకు చేస్తాడు? చివ‌రికి తన అన్నయ్యని కాపాడుకున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే

Kingdom Movie Review | న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్..

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈసారి తన కెరీర్‌లో తొలిసారి పూర్తిగా భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆయన చేసిన‌ పాత్రకు జీవం పోసిన తీరు చూస్తే, “ఇలాంటి క్యారెక్టర్‌కి విజయ్‌ కాక మరెవరైనా న్యాయం చేయగలరా?” అనే సందేహమే కలుగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన యాక్టింగ్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ లుక్ తీసుకువెళ్లింది.ఈ చిత్రంలో ఆయన నటనలో మెచ్యూరిటీ స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాలో తన శైలిని పూర్తిగా మార్చుకుని, పాత్రకు తగ్గ ఆటిట్యూడ్, స్లాంగ్‌ను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. డైలాగ్ డెలివరీ(Dialogue Delivery)లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. భాగ్యశ్రీ కి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఆమె పాత్రకు ఉన్న ఎమోషనల్ డెప్త్‌ను ఆమె పూర్తిగా అర్థం చేసుకుని, తన సహజ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

సత్యదేవ్ (Satyadev) మరోసారి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌తో మెప్పించాడు. విజయ్ దేవరకొండకు అన్నగా, మాఫియా డాన్‌గా ఆయన చేసిన నటన చాలా బలంగా నిలిచింది. ఇప్పటి వరకూ చేసిన పాత్రల కంటే ఇది ఆయనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. ఎవరి పాత్రైనా సరే సినిమాలో ఆ సందర్భానికొచ్చే ఎమోషన్‌ను తగ్గకుండా కన్వే చేయగలిగారు. మొత్తంగా చూసుకుంటే, నటీనటుల పరంగా “కింగ్డమ్” సినిమా చాలా బలంగా నిలిచింది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ వంటి ప్రధాన నటుల పెర్ఫార్మెన్స్ సినిమాకే హైప్‌, గ్రావిటీనీ తీసుకొచ్చాయి.

Kingdom Movie Review | టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

సంగీతం పరంగా అనిరుధ్ త‌న ఫుల ఎఫ‌ర్ట్ పెట్టాడు. ఈ సినిమాలో సిచువేషన్​కు తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్​ను అందించి సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలో ఒక హై ఫీల్ అయితే క‌లిగించాడు అనే చెప్పాలి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసుకున్న‌ స్క్రిప్ట్ ప‌రంగా తెర‌కెక్కించ‌గ‌లిగాడు. కొన్ని చోట్ల నేరేషన్ ఫ్లాట్ అనిపించినా ప్రోపర్ డ్రామా బిల్డ్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాకు విజువల్స్ కూడా చాలా వరకు ప్లస్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్

విజయ్ దేవరకొండ ప‌ర్‌ఫార్మెన్స్
గౌతమ్ డైరెక్షన్
కొన్ని ఎలివేషన్ సీన్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే
సెకండాఫ్ లో కొన్ని స‌న్నివేశాలు

విశ్లేష‌ణ‌:

భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన కింగ్‌డ‌మ్ చిత్రం అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ కాద‌నే చెప్పాలి. చిత్రంలో ఇంట్రడక్షన్, రగిలే రగిలే సాంగ్ లీడ్, క్లైమాక్స్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. మిగతా అంతా ఎమోషనల్ డ్రామాగా ఆక‌ట్టుకుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్​తో సినిమాను ఒక్క‌సారిగా పైకి లేపాడు గౌత‌మ్. ఇక సెకండాఫ్ అయితే ప్లాట్‌గా సాగుతుంది. ప్రేక్ష‌కుడు మొత్తంగా మంచి సినిమా చూసామ‌నే భావ‌న‌లో అయితే ఉంటారు. ఫ‌స్టాఫ్‌లో కాస్త యాక్ష‌న్ ఉండ‌డం, సెకండాఫ్‌లో సెంటిమెంట్ ఎక్కువ‌గా ఉండ‌డంతో మూవీ బాగానే అనిపిస్తుంది. అయితే ఎమోష‌న్స్ సెకండాఫ్‌లో ఇంకాస్త వ‌ర్క‌వుట్ అయి ఉంటే బాగుండు అనిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి (Director Gautham Tinnanuri) ఇంతకుముందు సాఫ్ట్ సినిమాలు చేసినప్పటికి ఈ సినిమాతో యాక్షన్ డైరెక్టర్​గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జ‌త చేస్తూ మూవీని అద్భుతంగా మలిచాడు. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటనతో పాటు అనిరుధ్ సంగీతం , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి.

చిత్రం: కింగ్‌డ‌మ్
న‌టీన‌టులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్
ద‌ర్శ‌కుడు: గౌత‌మ్ తిన్న‌నూరి
సంగీతం: అనిరుధ్ ర‌విచంద‌ర్
నిర్మాత‌: నాగ‌వంశీ
రిలీజ్ డేట్: జులై 31, 2025

రేటింగ్‌: 2.5/5