ePaper
More
    HomeజాతీయంKarnataka | పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. కొట్టి చంపిన కొందరు వ్యక్తులు

    Karnataka | పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. కొట్టి చంపిన కొందరు వ్యక్తులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Karnataka | పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam terror attack) అనంతరం భారత్, పాకిస్తాన్(Ind – pak) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో భారత్​తో ఉంటూ శత్రు దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తిని కొట్టి చంపారు. కర్ణాటక(Karnataka)లోని మంగళూరు(Mangalore)లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా జరిగిన స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసిన ఒక వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటనను కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ధ్రువీకరించారు. పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఇప్పటికే కొందరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

    Karnataka | పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు..

    మంగళూరులో ఆదివారం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్​(Cricket tournament)కు పది జట్లు, 100 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా ఓ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశాడు. ఈ క్రమంలో బాధితుడికి, మరో వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగింది. కాసేపటికే అది సామూహిక దాడికి దారి తీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంతమంది ఆగంతకులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, జనంలో ఒక వర్గం ఆ వ్యక్తిని కర్రలతో చితక్కొట్టారు. బాధితుడి మృతదేహం కనిపించిన తర్వాత సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. మొదట్లో పెద్దగా గాయాలు కనిపించలేదని, దీంతో అధికారులు సహజ మరణంగా అనుమానించారని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.. ఆ తర్వాత కేసును మంగళూరు(Mangalore) రూరల్ పోలీస్ స్టేషన్​కు అప్పగించారు. అయితే, సాయంత్రం తరువాత అసలు విషయం తెలిసిందని, ఆ వ్యక్తిపై కొందరు దాడి చేశారని చెప్పారు. వెన్లాక్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన పోస్ట్​మార్టంలో అంతర్గత రక్తస్రావం, వీపుపై దెబ్బలు తగిలిన కారణంగా షాక్​కు గురై మరణించాడని తేలింది. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Kerala Government | కేరళ ప్ర‌భుత్వం వినూత్న పథకం.. ఖాళీ ప్లాస్టిక్ మద్యం సీసాకు రూ. 20 వాపసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Government | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరళ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి...

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...