అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Samantha – Raj | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల ఆమె నటించిన పాత్రలకన్నా వ్యక్తిగత జీవితం ఆసక్తికరమైన అంశంగా మారుతుంది. ఇటీవల సమంత(Heroine Samantha) .. నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లిన కూడా ఈ జంట కలిసి వెళుతుండడంతో అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల బయటకు వచ్చిన ఓ ఫోటోలో రాజ్, సమంత భుజంపై చేయి వేసి ఎంతో సన్నిహితంగా నవ్వుకుంటూ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అంతకముందు సమంత..రాజ్ భుజంపై వాలి ఫొటోలకి పోజులిచ్చింది. వీరిద్దరు ఇంత అన్యోన్యంగా కనిపిస్తుండడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
మళ్లీ చిక్కారు..
ఇక ఇదిలా ఉంటే సమంత, రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తాజాగా ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కారు. సమంత ఫోన్ మాట్లాడుతుంటే, రాజ్ ఆమె పక్కన కూర్చొని ఉన్నాడు. వీరిద్దరిని ఇలా చూసిన నెటిజన్స్ ఇక వారి రిలేషన్‌లో క్లారిటీ వచ్చినట్టేనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సమంత, రాజ్ నిడిమోరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మొదట పెళ్లి ఆగస్ట్‌లోనే జరుగుతుందని వార్తలు వచ్చినా, సమంత మాత్రం అక్టోబర్ నెలకే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఆసక్తికరంగా, అక్టోబర్ 6 తేదీని పెళ్లి రోజుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం.సమంత–నాగ చైతన్య వివాహం కూడా ఇదే తేదీన జరిగింది. చైతూకి షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సమంత ఈ తేదీని ఎంచుకున్నదన్న ప్రచారం ఊపందుకుంది. పెళ్లి ఎంతో సింపుల్‌గా, హంగూ ఆర్భాటాల్లేకుండా చర్చిలో జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇక తన కెరీర్ విషయంలో మాత్రం సమంత ఇప్పుడు మరింత ఫోకస్ చూపిస్తోంది. ఇకపై కేవలం డిఫరెంట్, చాలెంజింగ్ రోల్స్‌నే చేయబోతున్నట్లు ఆమె స్పష్టం చేసింది. వెబ్ సిరీస్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌పై కూడా దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత “మా ఇంటి బంగారం” అనే చిత్రంతో పాటు, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తుంది.. ఈ సిరీస్‌ను రాజ్ & డీకేలు తెరకెక్కిస్తుండగా, ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరిగా సమంత శుభం చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే.
View this post on Instagram