ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్‌ గడువు పొడిగింపు.. మూడు రోజుల్లో ప్రభుత్వానికి చేరనున్న నివేదిక

    Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్‌ గడువు పొడిగింపు.. మూడు రోజుల్లో ప్రభుత్వానికి చేరనున్న నివేదిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్​ గడువును మరో మూడు రోజులు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్​(Kaleshwaram Project)లో అక్రమాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విచారణకు ప్రభుత్వం జస్టిస్​ పీసీ ఘోష్(Justice PC Ghosh) నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్​ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ గడువు మే 31తోనే ముగిసింది.

    Kaleshwaram Commission | వారి విచారణ కోసం..

    కాళేశ్వరం కమిషన్​(Kaleshwaram Commission) దాదాపు 200 మంది అధికారులను విచారించింది. కీలకంగా వ్యహరించిన ఇంజినీరింగ్​ అధికారులను పలుమార్లు విచారించింది. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తాము నడుచుకున్నామని అధికారులు తెలిపారు. దీంతో అప్పటి మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)​, మాజీ మంత్రులు హరీశ్​రావు(Harish Rao), ఈటల రాజేందర్ ​ను విచారించాలని కమిషన్​ నిర్ణయించింది. దీంతో మే 31తో ముగియాల్సిన కమిషన్​ గడువును ప్రభుత్వం రెండు నెలల పాటు పొడిగించింది.

    READ ALSO  Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    Kaleshwaram Commission | నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల

    కమిషన్​ జూన్​లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajender)​, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్​రావును విచారించింది. అన్ని నిర్ణయాలు కేబినెట్​లో చర్చించి తీసుకున్నట్లు వారు తెలిపారు. వీరిని బీఆర్​కే భవన్(BRK Bhavan)​లో కమిషన్​ బహిరంగంగా విచారించింది. అనంతరం మాజీ సీఎం కేసీఆర్​ సైతం విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో బహిరంగా విచారణ కాకుండా ఫేస్​ టు ఫేస్​ విచారణకు హాజరయ్యారు.

    కమిషన్​ ముఖ్యంగా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ(Medigadda)కు ప్రాజెక్ట్​ను ఎందుకు మార్చారు, డిజైన్​ మార్పు వెనక కారణం ఏమిటి, నిధులు ఎలా విడుదల చేశారనే వివరాలు సేకరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేసినట్లు కమిషన్​ గుర్తించింది.

    READ ALSO  Mla Dhanpal | కమ్యూనిటీ హాల్ నిర్మాణం.. అభినందనీయం

    Kaleshwaram Commission | 400 పేజీలతో నివేదిక

    కాళేశ్వరం కమిషన్​ 400 పేజీలతో తుది నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ రోజుతో కమిషన్​ గడువు ముగియనుంది. అయితే నివేదికను ఫైనల్​ చేసి ప్రభుత్వానికి అందించనుంది. దీనికోసం మరో మూడు రోజులు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో ఐఏఎస్​ అధికారులు, ఇంజినీర్ల మధ్య సమన్వయలోపం ఉందని కమిషన్​ పేర్కొంది. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ప్రస్తావించింది. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు కమిషన్​ గుర్తించింది.

    Kaleshwaram Commission | అసెంబ్లీలో ప్రవేశ పెట్టే యోచన

    కాళేశ్వరం కమిషన్​ తన తుది నివేదికను మూడు రోజుల్లో సమర్పించనుంది. అనంతరం దీనిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్​ కుటుంబం కమీషన్ల కోసమే దీనిని నిర్మించారని కాంగ్రెస్​, బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చ పెట్టి బీఆర్​ఎస్​ను ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరంలో అక్రమాలపై చర్చ జరిగితే కాంగ్రెస్​కు లాభం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

    READ ALSO  Nizamabad Collector | లక్ష్యాల సాధనకు అంకితభావంతో పనిచేయాలి

    Latest articles

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    Saina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saina kashyap couple | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి...

    Ind vs Eng | విజ‌యానికి 8 వికెట్ల దూరంలో భార‌త్.. 123 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తారా..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind vs Eng | ఇంగ్లండ్‌తో England జ‌రుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఓవ‌ల్ వేదిక‌గా చివ‌రి...

    More like this

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    Saina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saina kashyap couple | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి...