అక్షరటుడే, వెబ్‌డెస్క్: SIIMA : దక్షిణాది చిత్ర పరిశ్రమ(South film industry)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ‘సైమా’ SIIMA గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సౌత్ సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఏడాది ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’(South Indian International Movie Awards) పేరుతో పురస్కారాలు అందిస్తుంటారు.
2012లో ఈ వేడుక మొదలు కాగా.. ఈసారి సైమా 13వ ఎడిషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా సైమా అవార్డ్స్-2025 నామినేషన్స్ ను నిర్వాహకులు ప్రకటించారు. సైమా అవార్డ్స్-2025లో భాగంగా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు, అందులో నటించిన నటీనటులు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నారు.
SIIMA : నామినేషన్స్‌లో ఎవరంటే…
తెలుగు Telugu, తమిళ Tamil, మలయాళ Malayalam, కన్నడ Kannada సినిమాలకు సంబంధించి నామినేట్ అయిన నటీనటుల జాబితాను కొద్ది సేపటి క్రితం సైమా అవార్డుల కమిటీ సోషల్ మీడియాలో పంచుకుంది.
తెలుగులో బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (మేల్) నామినేషన్స్ చూస్తే.. పుష్ప2- అల్లు అర్జున్ (Pushpa 2- Allu Arjun), దుల్కర్ సల్మాన్- లక్కీ భాస్కర్ (Dulquer Salmaan- Lucky Bhaskar), ఎన్టీఆర్ NTR- దేవర Devara , నాని- సరిపోదా శనివారం (Nani- Saripoda Shanivaram), ప్రభాస్- కల్కి (Prabhas- Kalki), తేజ సజ్జా – హనుమాన్ (Teja Sajja – Hanuman) నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నారు.
వీరిలో అల్లు అర్జున్, ప్రభాస్‌లలో ఒకరు అవార్డు దక్కించుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇక బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (ఫీమేల్) తెలుగులో చూస్తే అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్, ఆషిక రంగనాథ్ – నా సామిరంగా, దీపిక పదుకొణే- కల్కి, మీనాక్షి-లక్కీ భాస్కర్, నివేదా థామస్- 35 చిన్న కథ కాదు, రష్మిక – పుష్ప2 నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నారు.
కొద్దిరోజుల క్రితం నామినేట్ అయిన చిత్రాలను కూడా ‘సైమా’ అవార్డుల కమిటీ సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ‘పుష్ప 2: ది రూల్’ Pushpa 2 సినిమా 11 నామినేషన్స్‌తో టాప్‌లో నిలవగా.. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’, ‘హను-మాన్’ సినిమాలు ఉన్నాయి.
తమిళంలో ‘అమరన్’ సినిమా ఏకంగా 13 నామినేషన్స్ దక్కించుకుంది. ఈ ఏడాది హయ్యెస్ట్ నామినేషన్స్ ఈ చిత్రానికే అని చెప్పాలి. శివ కార్తికేయన్, సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.
ఇక ‘ సైమా అవార్డ్స్ 2025 ’ కార్యక్రమం సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్ వేదికగా గ్రాండ్ గా జరగనున్న విషయం విదితమే.