అక్షరటుడే, గాంధారి:Mla Madan Mohan Rao | మండల కేంద్రంలోని నారాయణగిరి కొండపై నూతనంగా మార్కండేయ మందిరం(Markandeya Temple Gandhari) నిర్మించారు. మే 12,13,14 తేదీల్లో ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.
మూడ్రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును mla madan Mohan Rao ఆలయ కమిటీ సభ్యులు కోరారు. మంగళవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్, సహకార సంఘం ఛైర్మన్ సాయికుమార్, పద్మశాలి కులస్థులు పాల్గొన్నారు.