Nizamabad City
Nizamabad City | మున్సిపల్​ స్థలం కబ్జాపై చర్యలు తీసుకోవాలి

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్‌నగర్‌ (Vinayak nagar) న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో (New Housing Board Colony) మున్సిపల్‌ స్థలాన్నికొందరు కబ్జా చేశారని హౌసింగ్‌ బోర్డు కాలనీ అసోసియేషన్‌ (Housing Board Colony Association) సభ్యులు ఆరోపించారు.

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బుధవారం నుడా ఛైర్మన్​ కేశవేణుకు (NUDA Chairman Kesha venu) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీలోని రోడ్‌ నం.1లో ఖాళీగా ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని, కారు షెడ్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు.

అంతేగాక, అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నిస్తున్నారని, ఆ స్థలంలో కాలనీవాసులకు ఉపయోగపడేలా పార్క్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బాల్‌సింగ్‌ నాయక్, హన్మంత్‌రావు, కె లక్ష్మణ్​, కమలాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.