Student Elections
Student Elections | డిగ్రీ కళాశాలలో విద్యార్థి ఎన్నికలు

అక్షరటుడే, ఆర్మూర్‌: Student Elections | పట్టణంలోని మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో (Women’s Degree Gurukul College) బుధవారం విద్యార్థి ఎన్నికలు (Student Elections) నిర్వహించారు. కళాశాల కెప్టెన్ (College Captain), వైస్‌ కెప్టెన్, సెక్రెటరీతో పాటు ఇతర విధుల నిర్వహణ నిమిత్తం అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా అధ్యాపకులు వ్యవహరించగా, విద్యార్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Student Elections | విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు..

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రిక తెలిపారు. ఎన్నికల సరళి, నియమావళి గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ ఎన్నికలు ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె పేర్కొన్నారు.