అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ తెలంగాణ ఇన్ఛార్జి సుభాష్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ అధ్యక్షుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, భిక్కనూరు, కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్లు పాత రాజు, ధర్మగోని లక్ష్మీ రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.