supriya menon
supriya menon | స్టార్ హీరో భార్య‌కి ఏడేళ్లుగా ఆన్‌లైన్ వేధింపులు.. ఇన్నాళ్ల‌కి అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టిందిగా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: supriya menon | మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ (prithviraj sukumaran) భార్య సుప్రియ మీనన్ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ (Social Media Post) ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడేళ్లుగా ఓ మహిళ నుంచి తాను తీవ్రంగా ఆన్‌లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నానని సుప్రియ పేర్కొన్నారు. సుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. 2018 నుంచి ఈ మహిళ నన్ను టార్గెట్ చేస్తోంది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, కొత్త కొత్త ఖాతాలు క్రియేట్ చేస్తూ నన్ను వేధిస్తోంది. ఒకసారి బ్లాక్ చేస్తే, వెంటనే ఇంకో ఖాతాతో వస్తుంది. ఇన్నాళ్లూ ఆమెకు ఒక చిన్న బాబు ఉందనే కారణంతోనే సహించాను. కానీ ఇప్పుడు నా తండ్రిపైన కూడా తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ప్రతిరోజూ ఆమె అకౌంట్లను బ్లాక్ చేయడం నా డైలీ రొటీన్ అయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

supriya menon | హీరో భార్య‌కు వేధింపులా?

సుప్రీయ (supriya menon) ఆ మహిళ ఫొటోను కూడా షేర్ చేస్తూ, “నా ద్వేషాన్ని ఏ ఫిల్టర్ కూడా కప్పిపుచ్చలేకపోతుంది” అంటూ పేర్కొనడం గమనార్హం. ఒక స్టార్ హీరో భార్య ఈ స్థాయిలో ఆన్‌లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నానని బహిరంగంగా చెప్పడం నిజంగా ఆందోళన కలిగించే అంశం. కాగా, సుప్రియ మీనన్, ఓ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి 2011లో పృథ్వీ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ (Prithvi Raj Productions) పేరుతో నిర్మాతగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ సుప్రియ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఒక మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇక పృథ్వీరాజ్ సినిమాల విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన ‘ఎంపురాన్ 2’ (Empuran 2) మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ పొలిటికల్ డ్రామా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మలయాళ సినీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది. ప్రస్తుతం పృథ్వీరాజ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సలార్ పార్ట్ 2’ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు, ఎస్.ఎస్. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB29లోనూ పృథ్వీ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో పాటు మలయాళంలో ‘విలాయత్ బుద్ధు’ అనే ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నాడు.