Collector Kamareddy
Collector Kamareddy | మద్నూర్​లో కలెక్టర్​ సుడిగాలి పర్యటన

అక్షరటుడే, నిజాంసాగర్: Collector Kamareddy | మద్నూర్ మండలంలో (Madnoor) కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. సబ్ కలెక్టర్ కిరణ్మయితో (Sub-Collector Kiranmayi) కలిసి ఆయన ముందుగా మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిని (Madnoor Government Hospital) పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. ఆస్పత్రిలో సమస్యలపై తక్షణమే చర్యలను తీసుకోవాలని ఆస్పత్రి పర్యవేక్షణ అధికారి ఆనంద్ జాదవ్ ఆదేశించారు.

Collector Kamareddy | ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

మండలంలోని హండేకేలూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్​ పరిశీలించారు. అనంతరం పెద్ద ఎక్లార గేట్ వద్ద సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగారు.. పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే నిధులు మంజూరు చేస్తున్నామని.. వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Collector Kamareddy | బోర్​వెల్​ కోసం రూ.లక్ష మంజూరు..

గురుకుల హాస్టల్ (Gurukul Hostel) విద్యార్థులకు నీటిసమస్య ఉండడంతో వెంటనే బోర్​వెల్​ నిమిత్తం కలెక్టర్​ రూ. లక్షను మంజూరు చేశారు. హాస్టల్ గేట్ వద్ద సెక్యూరిటీ గార్డుల కాపలా కోసం, షెడ్​ నిర్మాణానికి నిధులు మంజూరుచేశారు.

రాత్రివేళ మెస్ వద్దకు వెళ్లేందుకు చీకటిగా ఉందని విద్యార్థులు పేర్కొనగా నాలుగు విద్యుత్​ స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్​శాఖ అధికారులను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా హాస్టల్​లో అటవీశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. వారి వెంట జిల్లా పంచాయతీ అధికారి మురళి, మండల ప్రత్యేకాధికారి రామ్మోహన్​, డివిజనల్​ పంచాయతీ అధికారి సత్యనారాయణ, హౌసింగ్​ డీఈ గోపాల్​, తహశీల్దార్ ఎండీ ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎంపీవో నర్సయ్య, గిర్దావర్​ శంకర్ ఉపాధ్యాయులు ఉన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, సబ్​ కలెక్టర్​ కిరణ్మయి