అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో త్వరలోనే నామినేటెడ్ పోస్టులు (Nominated Posts) భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) నామినేటేడ్ పదవుల కోసం కొన్నాళ్లుగా నిరీక్షిస్తున్నారు. తమకు పదవులు కావాలని పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే పదవుల పంపకాలు చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డితో (CM Revanth Reddy) కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయి. ఆలోపే నామినేటేడ్ పదవులు భర్తీ చేస్తే కార్యకర్తలు, నాయకుల్లో జోష్ వస్తోందని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే నామినేటేడ్ పదవుల జాబితా సిద్ధం అయినట్లు సమాచారం.
CM Revanth Reddy | బీసీ రిజర్వేషన్లపై చర్చ
జుబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో వీరు భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, మీనాక్షి నటరాజన్ పాదయాత్ర గురించి దాదాపు గంటన్నరపాటు నేతలు చర్చించారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పాదయాత్ర చేపట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని కాంగ్రెస్ (Congress) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ (Delhi)లో కార్యక్రమాలు చేపట్టనుంది. 6న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. అనంతరం 7న రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని వినతి పత్రం ఇవ్వనున్నారు.