ePaper
More
    HomeతెలంగాణBhu Bharati | భూ సమస్యలు తీరేనా..! త్వరలో అమలులోకి రానున్న భూ భారతి చట్టం

    Bhu Bharati | భూ సమస్యలు తీరేనా..! త్వరలో అమలులోకి రానున్న భూ భారతి చట్టం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Bhu Bharati | ధరణి(Dharani) తర్వాత అనేక భూ సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా వీఆర్‌వో వ్యవస్థ(VRO system) రద్దు తర్వాత గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సర్వేయర్ల కొరతతో ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కాక రైతులు తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. పక్షం రోజుల్లో గ్రామ పంచాయతీ పాలనాధికారులను (వీఆర్వో, వీఆర్‌ఏ) వ్యవస్థను తిరిగి నియమిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti srinivasreddy) ప్రకటించారు.

    తెలంగాణలో ఆది నుంచి పటేల్‌, పట్వారీ వ్యవస్థ(Patwari system) అమలులో ఉండేది. ఎన్టీ ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ను రద్దు చేసి వీఆర్‌వోలను(VRO) నియమించారు. రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్‌వో(VRO)ను నియమించారు. వీరు ఆయా గ్రామాల్లో భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టే వారు. అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో 2020లో వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేశారు. వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేసి ధరణి పోర్టల్‌(Dharani portal)ను తెరపైకి తెచ్చారు.

    Bhu Bharati | అవినీతి ఆరోపణలతో..

    గ్రామ రెవెన్యూ పాలన(Village Revenue Administration)లో వీఆర్వోలు అవినీతికి పాల్పడుతూ శాఖకు మచ్చ తెస్తున్నారని నాటి సీఎం కేసీఆర్‌ వీఆర్‌వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 440 రెవెన్యూ గ్రామాలుండగా దాదాపుగా అంతే మంది వీఆర్వోలు(VRO’s) ఉండేవారు. కామారెడ్డి జిల్లాలో 217 రెవెన్యూ గ్రామాలుండగా 197 మంది వీఆర్వోలు(VRO’s) పనిచేసేవారు. వీఆర్‌వో వ్యవస్థ రద్దు తర్వాత వీరిని దాదాపు రెండేళ్ల పాటు కార్యాలయాల్లో ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇచ్చారు. 2022లో ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. త్వరలో ప్రభుత్వం తిరిగి గ్రామాల్లో వీఆర్వో(VRO), వీఆర్‌ఏ వ్యవస్థ(VRA System) తేబోతుంది.

    Bhu Bharati | సర్వేయర్ల పోస్టుల భర్తీ

    గతంలో భూ సమస్యలు ఉంటే చలాన్‌ కడితే మండల సర్వేయర్‌(Mandal Surveyor) వచ్చి వివాదాస్పద భూముల కొలతలు చేసి హద్దులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం రెండు మూడు మండలాలకు ఒక సర్వేయర్‌ ఉండటంతో భూ సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 6 వేల మంది సర్వేయర్లకు నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Minister Ponguleti srinivasreddy) ప్రకటించారు. దీంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    129 జీవోతో జీరో సర్వీస్‌

    - సుధాకర్‌ రావు, వీఆర్‌వోల సంక్షేమ సంఘం రాష్ట్ర నేత
    – సుధాకర్‌ రావు, వీఆర్‌వోల సంక్షేమ సంఘం రాష్ట్ర నేత

    ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 129 జీవోతో వీ ఆర్వోల సర్వీస్‌ జీరో అయిపోయింది. ఒక్కో వీఆర్వోకు 30 నుంచి 40 ఏళ్ల సర్వీస్‌ ఉంది. ప్రస్తుత జీవో ద్వారా కొత్తగా మళ్లీ ఉద్యోగంలో చేరినట్టు అవుతుందని వీర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత సర్వీస్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

    – సుధాకర్‌ రావు, వీఆర్‌వోల సంక్షేమ సంఘం రాష్ట్ర నేత

    ఎలాంటి పరీక్ష లేకుండా తీసుకోవాలి

    - మాణిక్యం, వీఆర్‌వోల సంక్షేమ సంఘం జిల్లా నేత
    – మాణిక్యం, వీఆర్‌వోల సంక్షేమ సంఘం జిల్లా నేత

    గతంలో పదో తరగతి చదువుకున్న వారిని నాటి సీఎం వైఎస్‌ఆర్‌ వీర్వోలుగా తీసుకున్నారు. గతం లో వీఆర్వోలుగా పనిచేసిన వారందరిని జీపీవోలుగా తీసుకోవాలి. సర్వీస్‌ నిబంధన, ఎలాంటి పరీక్ష లేకుండానే జీపీవోలుగా అవకాశం కల్పించాలి. జీపీవోలకు వీఆర్‌ఏలను అటాచ్‌ చేయాలి.

    – మాణిక్యం, వీఆర్‌వోల సంక్షేమ సంఘం జిల్లా నేత

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....