- Advertisement -
HomeUncategorizedEarthquake | భూకంపంతో భవనం ఊగిపోతున్నా.. ధైర్యంగా శస్త్రచికిత్స చేసిన రష్యన్ వైద్యులు

Earthquake | భూకంపంతో భవనం ఊగిపోతున్నా.. ధైర్యంగా శస్త్రచికిత్స చేసిన రష్యన్ వైద్యులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Earthquake | సాధార‌ణంగా భూకంపం వ‌స్తే భ‌యంతో ప‌రుగులు పెట్ట‌డం మ‌నం చూస్తూ ఉంటాం. ఎవ‌రు ఎలాంటి ప‌రిస్థితిలో ఉన్నా కూడా భూకంపం వ‌చ్చిన‌ప్పుడు సుర‌క్షిత ప్రాంతాల‌కు ప‌రుగులు పెడుతుంటారు. కానీ ర‌ష్యాకి  చెందిన ఆంకాల‌జీ వైద్యులు (Oncology Doctors) ధైర్యంగా ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ఉండి శ‌స్త్ర‌చికిత్స (Surgery) చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఇది చూసిన వారంద‌రు వారిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రష్యాలోని కామ్‌చట్కా ద్వీపంలో భారీ భూకంపం (Major Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో (రిక్టర్​ స్కేల్​పై 8.8) ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Earthquake | ఇది క‌దా డెడికేష‌న్ అంటే..

అయితే, ఆ విపత్కర పరిస్థితిలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి తమ విధిని నిర్విరామంగా నిర్వర్తించిన వైద్యులు అందరినీ ఆశ్చ‌ర్యప‌రిచారు. భూకంపం సంభవించిన సమయంలో కామ్‌చట్కా ఆంకాలజీ సెంటర్‌లో ఓ క్యాన్సర్ పేషెంట్‌కు (Cancer Patient) శస్త్రచికిత్స జరుగుతోంది. భూమి ఊగిపోతున్నా, ఆపరేషన్ రూమ్ క‌దులుతున్నా, అక్క‌డ ఉన్న వైద్యులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. వైద్య సిబ్బంది ఎంతో ధైర్యంగా, నిశ్చలంగా పేషెంట్ బెడ్ వ‌ద్ద నిలిచి శస్త్రచికిత్సను కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కామ్‌చట్కా ఆరోగ్య శాఖ మంత్రి ఓలేగ్ మెల్నికోవ్(Kamchatka Health Minister Oleg Melnikov) తన అధికారిక టెలిగ్రాం ఛానెల్లో షేర్ చేశారు.

- Advertisement -

వీడియోలో ఆపరేషన్ రూమ్(Operation Room) బలంగా కంపించడంతో పరికరాలు కదిలిపోతున్నా, వైద్యుల ధైర్యం ఎంత ఉన్నతమైనదో స్పష్టంగా కనిపిస్తోంది. పేషెంట్ ప్రాణాలను కాపాడే పనిలో ఉన్న డాక్టర్లు, డేంజర్ ప‌రిస్థితిలో ఉన్నప్పటికీ ఆపరేషన్ రూమ్‌ను వదలకుండా నిలబడడం వీరి ప్రొఫెషనలిజాన్ని చూపుతోంది అని మంత్రి మెల్నికోవ్ ప్రశంసించారు. ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. వైద్య బృందం చూపిన నిబద్ధత, ధైర్యానికి ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విపత్తుల సమయంలో బాధ్యతను మరింతగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంత ఉందో ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)

- Advertisement -
- Advertisement -
Must Read
Related News