Al Quaida Terror
Al-Qaeda Terror | గుజ‌రాత్‌లో అల్‌ఖైదా టెర్ర‌ర్ మాడ్యూల్.. మ‌హిళను అరెస్టు చేసిన ఏటీఎస్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Al-Qaeda Terror | ఇండియాలో అల్-ఖైదాతో (Al-Qaeda) సంబంధం ఉన్న టెర్రర్ మాడ్యూల్ గుట్టును గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (Anti Terrorism Squad) ర‌ట్టు చేసింది. ఈ మాడ్యూల్ వెనుక ఉన్న కీలక వ్య‌క్తి 30 ఏళ్ల షామా పర్వీన్ ను అరెస్టు చేసింది.

క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. పర్వీన్ మొత్తం మాడ్యూల్‌ను నడుపుతున్నద‌ని, కర్ణాటక (Karnataka) నుంచి కార్యకలాపాలను సమన్వయం చేసే ప్రధాన నిర్వాహకురాలిగా ఉందని గుర్తించింది. దేశంలో ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తిస్తున్న వారిని గుర్తించడానికి చేప‌ట్టిన ప్ర‌త్యేక ఆప‌రేష‌న్‌లో భాగంగానే ఆమెను అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం.

Al-Qaeda Terror | ఉగ్ర‌ముఠాకు నాయ‌క‌త్వం..

ఏటీఎస్ గత వారం అరెస్టు చేసిన నలుగురు అల్-ఖైదా ఉగ్రవాదుల నుంచి లభించిన ఆధారాల ఆధారంగానే ఆమెను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిసింది. అల్‌ఖైదా టెర్ర‌ర్ మాడ్యూల్‌తో (Al Qaeda Terror Module) సంబంధం ఉన్న మ‌హ‌మ్మ‌ద్ ఫ‌ర్దీన్‌, సెపుల్లా ఖురేషి, అలీ, మ‌హ‌మ్మ‌ద్ ఫైక్ ల‌ను జూలై 23న టీఎస్ బృందం గుజ‌రాత్ఏ, ఢిల్లీ, నోయిడాలో అదుపులోకి తీసుకుంది.

వీరంతా సోష‌ల్ మీడియాలో ఓ ర‌హ‌స్య ఆటో డిలిటెడ్ యాప్ ద్వారా సంప్ర‌దింపులు చేసుకుంటున్నార‌ని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ గ్రూప్ స‌భ్యులు ఉన్నార‌ని అధికారులు గుర్తించారు. వారంద‌రికీ ప‌ర్వీన్(Shama Parveen) నాయ‌క‌త్వం వ‌హిస్తున్నార‌ని గుర్తించి ఆమెను బెంగ‌ళూరులో అరెస్టు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు ద‌ర్యాప్తులో గుర్తించారు. బెంగళూరులో అరెస్టు చేసిన మహిళ అత్యంత తీవ్రవాదానికి పాల్పడిందని, ఆన్‌లైన్ టెర్రర్ మాడ్యూల్‌ను నడుపుతుందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి(Gujarat Home Minister Harsh Sanghvi) వెల్ల‌డించారు. ఆమెకు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలను గుర్తించిన‌ట్లు తెలిపారు.