అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam)లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ విచారణకు ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణ ప్రారంభించిన అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఇందులో కీలక నిందిడుతు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా మరో నిందితుడు వరుణ్(Varun)ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
AP Liquor Scam | ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్..
లిక్కర్ కేసులో ఏ 40గా ఉన్న వరుణ్‌ను సిట్ అధికారులు(SIT Officers) అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు తప్పించుకొని పారిపోవడానికి ఆయన యత్నించగా.. ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరింది. వరుణ్‌ను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
AP Liquor Scam | అట్టపెట్టెల్లో రూ.11 కోట్లు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో అక్రమంగా దాచి ఉంచిన నగదును అధికారులు సీజ్ చేశారు. ఓ ఫామ్‌హౌస్‌లో 12 అట్టపెట్టెల్లో దాచి ఉంచి రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ కేసు(Liquor Case)లో నిందితుడు వరుణ్ వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఓ ఫామ్‌హౌస్(Kachharam Farm House)లో దాచిన నగదును అధికారులు సీజ్ చేశారు. నగదు బయట పడటంతో వరుణ్ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. విదేశాలకు పారిపోవడానికి యత్నించగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
AP Liquor Scam | విజయవాడకు తరలింపు
లిక్కర్ స్కామ్‌లో ఏ40గా ఉన్న వరుణ్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులకు విజయవాడ(Vijayawada)కు తీసుకెళ్లారు. ఈ రోజు ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. రాజ్‌కసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు రూ.11 కోట్ల నగదును వరుణ్ దాచిపెట్టినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.