అక్షరటుడే, భీమ్‌గల్: Gurukul Colleges | వేల్పూర్ (Velpur), ఆర్మూర్(Armoor) మండలాల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో (Telangana Social Welfare Gurukul Junior College) తక్షణ ప్రవేశాలు పొందేందుకు ఆహ్వానం పలుకుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ తెలిపారు.
ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ ఫస్టియర్‌కు గాను ఖాళీసీట్లను ఈనెల 31లోగా భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పదో తరగతిలో మొదటి ప్రయత్నంలో పాసైన విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులన్నారు.
తక్షణ ప్రవేశాల కోసం విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 31న వేల్పూర్, ఆర్మూర్ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అదేరోజు ఎంపికైన విద్యార్థులు జాబితాను ప్రకటిస్తామన్నారు. తదుపరి సమాచారం కోసం తమ కళాశాలలో సంప్రదించాలన్నారు.