అక్షరటుడే, వెబ్డెస్క్: Actress Esha Koppikar | హీరో నాగార్జున తనను 14 సార్లు చెంపదెబ్బ కొట్టాడని ప్రముఖ నటి ఈషా కొప్పికర్ (Actress Esha Koppikar) షాకింగ్ న్యూస్ వెల్లడించింది. చంద్రమౌలి చిత్ర నిర్మాణంలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంది. బాలీవుడ్, దక్షిణ చిత్రాలలో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న ఈషా .. ‘హిందీ రష్’తో జరిగిన సుదీర్ఘ సంభాషణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
సూపర్ స్టార్ నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) తనను 14 సార్లు చెంపదెబ్బ కొట్టిన ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. 1998లో వచ్చిన చంద్రలేఖ చిత్రంలోని (Chandralekha Movie) ఒక సన్నివేశంలో ఈ చెంపదెబ్బలు ఓ భాగమని ఈషా వెల్లడించింది. కామెడీ, డ్రామా మేళవింపుతో దర్శకుడు కృష్ణవంశీ (Director Krishna Vamsi) రూపొందించిన చంద్రముఖి అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, నాగార్జునతో పాటు అప్పుడే తెర ప్రవేశం చేసిన నాయిక ఇషా కొప్పికర్ నటించారు. ఇది ప్రియదర్శన్ 1997లో మలయాళంలో విడుదలైన చంద్రలేఖ చిత్రానికి రీమేక్. హిందీనటుడు సంజయ్ దత్ తొలిసారిగా తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.
Actress Esha Koppikar | నిజంగానే కొట్టమన్నా..
ఈ 14 చెంపదెబ్బల వెనుక ఉన్న పెద్ద కథను ఈషా వెల్లడించింది. నాగార్జున నిజంగానే తనను కొట్టినట్లు తెలిపింది. తాను చాలా నిబద్ధత కలిగిన నటిని, నిజమైన, సహజమైన పద్ధతిలో నటించాలి కాబట్టి ఆయన కొట్టిన చెంపదెబ్బలకు బాధగా అనిపించలేదని చెప్పారు. ఆ సన్నివేశం సహజంగా రావాలని నిజంగానే కొట్టాలని తాను నాగార్జునను కోరినట్లు చెప్పింది. చంద్రముఖి తన రెండో సినిమా అని, వాస్తవంగానే తనను చెంపదెబ్బ కొట్టమని అక్కినేనిని అడిగినట్లు తెలిపింది. తాను అలా అడిగినప్పుడు, నాగార్జున ఆశ్చర్యపోయి మీరు నిజంగానే అంటున్నారా? అని ప్రశ్నించినట్లు వివరించింది. సరైన వ్యక్తీకరణలను చూపించడానికి చెంపదెబ్బ కొట్టిన అనుభూతి అవసరమని చెప్పానని వివరించింది. “నాకు అస్సలు బాధ అనిపించలేదు. ఆయన నిజంగానే నన్ను కొట్టాడు కానీ ప్రేమతో.” అని ఈషా తెలిపింది.
Actress Esha Koppikar | నాగ్ సార్ సారీ చెప్పారు..
షాట్ బాగా రావడానికి నాగార్జునతో 14 సార్లు చెంపదెబ్బలు తిన్నానని ఈషా వెల్లడించింది. దీంతో తన చెంపపై చేతి గుర్తులు పడ్డాయంది. సహజంగా తనకు కోపం ఎక్కువ అని, కానీ నాగ్ సార్ కొడుతుంటే కోపం రాలేదని తెలిపింది. “నిజ జీవితంలో నాకు ఎక్కువ కోపం వస్తుంది. కానీ నేను కెమెరా ముందు కోపంగా ఉండలేను. సమస్య ఏమిటో తెలియదు. ఆ కోపంలో నన్ను 14 సార్లు కొట్టారని” అని చెప్పింది. సన్నివేశం ఓకే అయిన తర్వాత నాగార్జున వచ్చి తనకు క్షమాపణలు చెప్పారని కొప్పికర్ గుర్తుచేసుకుంది.