IND PAK Semi Finals
IND PAK Semi Finals | ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి సెమీస్‌కి వెళ్లిన భార‌త్.. రేపు పాక్‌తో మ్యాచ్ ఆడుతుందా?

అక్షరటుడేర, వెబ్​డెస్క్ : IND PAK Semi Finals | ప్ర‌స్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో ఇండియా ఛాంపియన్స్ జట్టు అద్భుత విజయంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. లీసెస్టర్‌లోని గ్రేస్ గ్రౌండ్ మైదానంలో (Grace Ground) జరిగిన ఈ కీలక పోరులో వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టుతో తలపడిన భారత్ జట్టు, అన్ని విభాగాల్లో సూపర్ ప్రదర్శన చూపించి విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ యువరాజ్ సింగ్ (India captain Yuvraj Singh) ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే తడబడ్డారు. క్రిస్ గేల్ 9 పరుగులకే అవుట్ కాగా.. లిండ్ల్ సిమన్స్ (2), చాడ్విక్ వాల్టన్ (0), పెర్కిన్స్ (0) త్వరగా పెవిలియన్ చేరారు. ఆ త‌ర్వాత క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ (Kieron Pollard) మాత్రం హోరెత్తించాడు.

IND PAK Semi Finals | అంతా స‌స్పెన్స్..

43 బంతుల్లో 8 సిక్సర్లతో అజేయంగా 73 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ ఛాంపియన్స్ (West Indies Champions) 20 ఓవర్లలో 144/9 పరుగులు చేసింది. ఇక భారత బ్యాటింగ్‌కి కూడా మంచి ఆరంభం దక్కలేదు. రాబిన్ ఉత్తప్ప (8), శిఖర్ ధావన్ (25) త్వరగా అవుట్ అయ్యారు. గుర్కీరత్ మన్ (7), సురేష్ రైనా (7) కూడా నిరాశపరిచారు. అయితే ఆ సమయంలో వచ్చిన స్టువర్ట్ బిన్నీ (Stuart Binny) ప‌రుగుల‌ వర్షం కురిపించాడు. 21 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లు సాయంతో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఆతడికి తోడుగా యువరాజ్ సింగ్ (21*) మరియు యూసుఫ్ పఠాన్ (21*) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివరకు ఇండియా ఛాంపియన్స్ (India Champions) జట్టు 13.2 ఓవర్లలో 148 పరుగులు చేసి, 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్ విజయంతో నెట్ రన్‌రేట్ ద్వారా ఇండియా ఛాంపియన్స్ జట్టు, ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌ను అధిగమించి టాప్ 4లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే వెస్టిండీస్‌కి కూడా సెమీస్ అవకాశముండేది. కానీ, భారత్​ విజయం ఆ ఆశను చెదరగొట్టింది. అయితే, సెమీస్‌కు దూసుకెళ్లిన భార‌త్ రేపు ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్‌లో సాయంత్రం ఐదు గంట‌ల‌కు (భార‌త కాల‌మానం ప్ర‌కారం) పాకిస్థాన్‌తో (Pakistan) మ్యాచ్ ఆడాల్సి ఉంది.. లీగ్ ద‌శ‌లో భార‌త ఆట‌గాళ్లు పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయ‌డంతో రెండు జ‌ట్ల‌కి చెరొక పాయింట్ ఇచ్చారు. ఒక వేళ సెమీస్‌లో భార‌త్ బాయ్‌కాట్ చేస్తే పాక్ డైరెక్ట్‌గా ఫైన‌ల్‌కి వెళుతుంది. మ‌రి సెమీస్‌లో దాయాదితో భార‌త్ ఆడుతుందా లేదా అనేది తెలియాలి అంటే కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.