Sriram Sagar
Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​కు తగ్గిన ఇన్​ఫ్లో.. 37 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాం​సాగర్ (Sriram Sagar)​ ప్రాజెక్ట్​కు ఇన్​ఫ్లో తగ్గింది. వరుసగా కురిసిన వర్షాలతో మంగళవారం (Mangalaram) వరకు ప్రాజెక్ట్​లోకి భారీగా వరద వచ్చింది. మంగళవారం ఉదయం 6 గంటలకు వరకు 89,812 క్యూసెక్కుల వరద రాగా.. 9 గంటలకు లక్షా 5వేలకు పెరిగింది. కాగా బుధవారం ఉదయం 6 గంటలకు 55,577 క్యూసెక్కులకు ఇన్​ఫ్లో పడిపోయింది. 9 గంటల సమయానికి 15,276 క్యూసెక్కుల వరద వస్తోంది.

Sriram Sagar | క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

రెండు రోజుల పాటు ప్రాజెక్ట్​లోకి భారీగా వరద రావడంతో నీటిమట్టం పెరిగింది. అయితే ప్రస్తుతం ఇన్​ఫ్లో (Inflow) తగ్గడంతో నీటమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1077.10 (37.632 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. ఎగువన మహారాష్ట్ర, స్థానికంగా కురిసన వర్షాలతో ప్రాజెక్ట్​లోకి ఇన్​ఫ్లో కొనసాగుతోంది.
జలాశయం నుంచి కాకతీయ ప్రధాన కాలువకు (Kakatiya Main Canal) 100 క్యూసెక్కులు, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 407 క్యూసెక్కులు పోతోంది. జలాశయంలోకి మూడు రోజుల వ్యవధిలో 14 టీఎంసీల వరద నీరు వచ్చింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.