అక్షరటుడేర, వెబ్‌డెస్క్ : Beauty Tips | వర్షాకాలం చర్మాన్ని బిగిసుకు పోయేలా చేస్తుంది. ఇది మొటిమలు, ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ఇవి చర్మాన్ని నిస్తేజంగా, పొడిగా మార్చుతాయి. వేడి, తేమతో కూడిన వాతావరణంలో కూడా మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడే చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవాలి. వంటిల్లునే బ్యూటీ పార్లర్(Beauty Parlor)గా మార్చుకుని ఫేస్‌ప్యాక్ ద్వారా మెరిసే ముఖ వర్చస్సును సొంతం చేసుకోవచ్చు.
Beauty Tips | ఫేస్‌ప్యాక్‌తో ముఖ సౌందర్యం
చర్మంపై ఉన్న రంధ్రాలను(Open Pores) శుభ్రం చేయడంలో ఫేస్ ప్యాక్‌లు సహాయపడతాయి. అలాగే చర్మాన్ని పోషించడంలోనూ సహాయపడతాయి. చర్మాన్ని శుభ్రపరచడంలో, ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడే వివిధ రకాల ఫేస్ ప్యాక్(Face Pack)లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే పాల పొడితో అనేక రకాల ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుని ప్రయత్నించవచ్చు.. ఆరోగ్యకరమైన, ప్రకాశించే చర్మం కోసం ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని పాల పొడి ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి.
Beauty Tips | పాల పొడి, తేనె ఫేస్ ప్యాక్ ..
తేమను లాక్ చేయడంలో సహాయపడే తేనె(Honey) సహజమైన హ్యూమెక్టంట్ గా పని చేస్తుండగా, పాల పొడి చర్మాన్ని ప్రోటీన్, లాక్టిక్ యాసిడ్‌తో పోషించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటి కలయిక పొడి, నీరసమైన చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి దోహదం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఒక టీ స్పూన్ పాలపొడి(Milk Powder)లో టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది.
Beauty Tips | పసుపు, రోజ్ వాటర్ తో..
పసుపు, రోజ్ వాటర్‌తో పాటు పాల పొడి కలుపుకుని తయారు చేసుకోవచ్చు. పసుపు పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని టోన్ చేయడానికి, పాలపొడి ఎక్స్‌ఫోలియేషన్‌కు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కలిసి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, ముఖాన్ని మరింత సౌందర్యవంతంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది. టేబుల్ స్పూన్ పాలపొడి, చిటికెడు పసుపు మిశ్రమానికి తగినంత రోజ్ వాటర్(Rose Water) కలిపి పేస్టులా తయార చేసుకుని ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మిలమిలమెరుస్తూ కనిపిస్తుంది.
Beauty Tips | నిమ్మరసం, పెరుగుతో..
పాలపొడి, నిమ్మరసం, పెరుగు మిశ్రమం చర్మ వర్చస్సును పెంచుతుంది. పెరుగులో సహజ ఎంజైమ్‌లు, ప్రోబయోటిక్‌లు ఉంటాయి. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి సహాయపడతాయి. విటమిన్ సీ పుష్కలంగా ఉండే నిమ్మరసం చర్మంలోని టాన్, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. టేబుల్ స్పూన్ పాలపొడిలో 1 టీస్పూన్ పెరుగు(Curd), కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారుచేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండ వల్ల నల్లగా మారిన ముఖాన్ని ప్రకాశవంతంతగా మార్చుకోవచ్చు. అయితే, నిమ్మకాయలో ఆమ్లత్వం కారణంగా వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే ఈ ఫేస్‌ప్యాక్‌ను వినియోగించాలి. .
Beauty Tips | ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్‌తో..
పాల పొడి, ముల్తానీ మిట్టి(Multhani Mitti), రోజ్ వాటర్‌తో మరో మంచి ఫేస్ ప్యాక్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ పాలపొడి, ముల్తానీ మిట్టిని రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి రుద్దుకోవాలి. ఇది జిడ్డు గల చర్మం ఉన్నవారికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. జిడ్డు గల, మొటిమల బారిన పడే చర్మం ఉన్నవారికి ఇది మంచి ఫేస్ ప్యాక్. ముల్తానీ మిట్టి చర్మంలోని అదనపు నూనెను గ్రహించి రంధ్రాలను బిగించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని పోషించడానికి, మృదువుగా చేయడానికి పాలపొడి సహాయపడుతుంది.