అక్షరటుడేర, వెబ్‌డెస్క్ : M & B Engineering IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల జాతర కొనసాగుతోంది. బుధవారం నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూ (Public issue) ప్రారంభం అవుతోంది. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్స్, సెల్ఫ్ సపోర్టడ్ రూఫింగ్ సొల్యూషన్స్ తయారు చేసి ఇన్స్టాల్ చేసే కంపెనీ అయిన ఎం అండ్ బీ ఇంజినీరింగ్ (M &B Engineering) లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 650 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 71,42,857 షేర్లను ఫ్రెష్ ఇష్యూ (Fresh issue) కింద జారీ చేస్తోంది. తద్వారా రూ. 275 కోట్లను సమీకరించనుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద 97,40,259 షేర్లను విక్రయించడం ద్వారా రూ. 375 కోట్లు పొందనుంది. ఈ ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీకి చెందిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం, కంపెనీ తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఐపీవో తేదీలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ (IPO Subscription) బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు ఒకటి వరకు బిడ్డింగ్‌కు గడువుంది. నాలుగో తేదీన షేర్స్ అలాట్‌మెంట్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆరో తేదీన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.
ధరల శ్రేణి..
ఈ ఐపీవో ప్రైస్ బ్యాండ్ (Price band) ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 366 నుంచి రూ. 385లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 38 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద ఒక లాట్ కోసం రూ. 14,630 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ..
ఈ ఐపీవోలో క్యూఐబీ(QIB)లకు 75 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాను కేటాయించారు. ఈ కంపెనీకి గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 43లుగా ఉంది. ఒకవేళ ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ రోజు 11 శాతం వరకు లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి.