ePaper
More
    Homeజిల్లాలునల్గొండdrunk drive case | డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులో నన్నే పట్టుకుంటారా..! పోలీస్​ స్టేషన్​లో...

    drunk drive case | డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులో నన్నే పట్టుకుంటారా..! పోలీస్​ స్టేషన్​లో నిప్పంటించుకున్న తాగుబోతు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: drunk drive case | ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. తప్పతాగి వాహనం నడపడమే కాకుండా.. అందరికీ ఊహించని షాక్​ ఇచ్చాడు. ఏకంగా పోలీస్ స్టేషన్​లోనే తనపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం (Telangana state) లోని నల్గొండ జిల్లా(Nalgonda district)లో చోటుచేసుకుంది.

    నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి నల్గొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు.. తక్షణం స్పందించి మంటలను ఆర్పివేసి బాధితుడుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

    నల్గొండ పట్టణంలో నర్సింహా అనే వ్యక్తి ఫూటుగా మద్యం తాగాడు. అనంతరం బండిపై డ్రైవ్​ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. తదుపరి చర్యలో భాగంగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    drunk drive case | కానిస్టేబుల్​కు గాయాలు..

    తనపై కేసు నమోదు చేయడంతో తెగ ఆవేశపడిపోయిన నర్సింహా పోలీస్ స్టేషన్​లోనే పెట్రోల్​ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఊహించని పరిణామానికి విస్తుపోయిన కానిస్టేబుళ్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్​కు గాయాలు కూడా అయ్యాయి.

    కాగా, తీవ్రంగా గాయపడిన నర్సింహాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

    Latest articles

    Collector Nizamabad | అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్...

    Cp Sai chaitanya | రిమార్క్​ లేకుండా పదవీ విరమణ చేయడం అభినందనీయం : సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | ఎలాంటి రిమార్క్​ లేకుండా పదవీ విరమణ చేయడం ఎంతో...

    IND vs ENG Test | వ‌రుస‌గా టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి భార‌త్ ఎంత స్కోరు చేసిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG Test | ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ప్రారంభ‌మైన‌ ఇంగ్లండ్- భార‌త్...

    Ex Mla Jeevan Reddy | అమలు కాని హామీలను ప్రజలు ప్రశ్నించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ చేపడుతున్న పాదయాత్రలో అమలు కాని హామీలను ప్రజలు...

    More like this