ePaper
More
    Homeక్రైంCBI Trap | లంచం తీసుకుంటూ దొరికిన ఇన్​కం ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్​

    CBI Trap | లంచం తీసుకుంటూ దొరికిన ఇన్​కం ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ (Vijayawada)లో ఇన్​కం ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్​, మరో మధ్యవర్తిని లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు (CBI Officers) మంగళవారం అరెస్ట్​ చేశారు.

    ఓ వ్యక్తిపై వచ్చిన పిటిషన్లపై చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం ఇన్​స్పెక్టర్ లంచం డిమాండ్​ చేశాడు. దీంతో సదరు వ్యక్తి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రూ.70 వేల లంచం తీసుకుంటుండగా.. ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్, ప్రైవేట్​ వ్యక్తిని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్ట్​ చేశారు.

    CBI Trap | రూ.5 లక్షలు డిమాండ్​

    ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సదురు అధికారి ఏలూరులోని రామచంద్రరావు పేటలో మొబైల్ సర్వీస్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై ఐటీ దాడులు జరపకుండా ఉండటానికి మొదట రూ.5 లక్షల లంచం డిమాండ్​ చేశాడు. అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో చివరకు రూ.1.20 లక్షలకు మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదిరింది.

    READ ALSO  Gold Rates | పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధర

    ఇందులో రూ.లక్ష అధికారికి, రూ.20 మధ్యవర్తి తీసుకోవాలని ఒప్పదం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ తరఫున ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు వల పన్ని మధ్యవర్తిని పట్టుకున్నారు. అనంతరం సదరు అధికారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 1 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    child marriage | 13 ఏళ్ల బాలిక మెడలో తాళి కట్టిన 40 ఏళ్ల వ్యక్తి.. హైదరాబాద్​కు కూతవేటు దూరంలోనే ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

    అక్షరటుడే, హైదరాబాద్: child marriage : బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో...

    HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association - HCA) భారీ కుదుపునకు గురైంది. HCA...

    Anil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​

    అక్షరటుడే, ఇందూరు: Anil Eravatri : వీర్ సావర్కర్ పదేళ్లు జైళ్లో ఉన్నా.. దేశానికి అవసరమైన సమయంలో మాత్రం...

    More like this