అక్షరటుడే, ఇందూరు: Minister seethakka | జిల్లా జనరల్ ఆస్పత్రిలో (GGH) సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని.. త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఆయా శాఖల్లో నెలకొన్న సమస్యలపై చర్చించామన్నారు. రాజకీయాల కతీతంగా సమస్యలను తెలుసుకున్నానని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పలు సూచనలు చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
Minister seethakka | త్వరలో ఆల్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం..
జిల్లాల్లో అతి త్వరలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.200 కోట్లు బ్యాంకు లింకేజీ ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల అభివృద్ధి కోసం మహిళా సమాఖ్య సభ్యులను కూరగాయల సాగులో ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. బీసీ రిజర్వేషన్ (BC Reservation) కల్పించడం కోసం రాష్ట్రపతి కలవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali), ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.