ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Seethakka | ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి

    Minister Seethakka | ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Minister Seethakka | ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లాలో వైద్యారోగ్యం (Medical health), ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme), రేషన్ కార్డులు (ration Cards), తాగు సాగునీరు, ఎరువులు విత్తనాలు, వ్యవసాయం, వన మహోత్సవం తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు.

    Minister Seethakka | అభివృద్ధి పనుల్లో అలసత్వంపై ఆగ్రహం..

    అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదని మంత్రి సీతక్క ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిధులు మంజూరై ఆర్నెళ్లు గడుస్తున్నా పనులు సక్రమంగా జరగడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులకు టెండర్లు పిలవాలని ప్రతిఒక్క పనిని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

    READ ALSO  New Ration Cards | ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం.. డిజిటల్​ కార్డులు అందజేస్తామన్న నాదెండ్ల

    Minister Seethakka | నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయ్​..

    పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీరు, గోదావరి జలాలు, అమృత్–1, అమృత్–2, పారిశుధ్యం, సెంట్రల్ లైటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శిశు మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, డ్వాక్రా మహిళలు జీవిత బీమా చేసుకునే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.

    Minister Seethakka | ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక..

    ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎవరికీ ఇబ్బంది రాకుండా రవాణా చేయాలన్నారు. వ్యవసాయానికి విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.

    READ ALSO  Kamareddy | బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. కార్మికుడి దుర్మరణం

    అనంతరం ప్రభుత్వ సలహాదారు అలీ షబ్బీర్ (Shabbir Ali) మాట్లాడుతూ డెంగీ తదితర వ్యాధులు సోకకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ్ల విషజ్వరాలు ప్రబలితే తక్షణమే హెల్త్​క్యాంపులు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తేవాలని సూచించారు. అర్హులందరికీ రేషన్​కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ధన్​పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

    Latest articles

    Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    అక్షరటుడే, ఆర్మూర్​: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర...

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...

    Health Camp | రేపు శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో మెగా వైద్యశిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం...

    More like this

    Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    అక్షరటుడే, ఆర్మూర్​: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర...

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...