Sirikonda Mandal
Sirikonda Mandal | తాళం వేసిన ఇళ్లే టార్గెట్​.. గడ్కోల్ గ్రామంలో పలు ఇళ్లలో చోరీ

అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda Mandal | జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తరచూ చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో (Gadkol village) పలు తాళం వేసిన ఇళ్లో చోరీ జరిగినట్లు ఎస్సై రామకృష్ణ (SI Ramakrishna) తెలిపారు. సోమవారం రాత్రి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు పక్క ఇళ్లకు బయట నుంచి గడియ పెట్టి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.

గ్రామానికి చెందిన మల్కి నరేశ్​ చెందిన ఇంట్లో రెండు తులాల మూడు గ్రాముల బంగారం, కటిక యాదులు ఇంట్లో పదివేల రూపాయలు చోరీ జరిగినట్లు తెలిసింది. మరో ఐదు ఇళ్లలో తాళాలు పగులగొట్టారని పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన విషయం తెలియగానే ధర్పల్లి సీఐ భిక్షపతి ఆధ్వర్యంలో గ్రామానికి వెళ్లి పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని, చోరీ జరిగిన ఇంటి యజమానులు ఇంతవరకు రాకపోవడంతో పక్క సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.