అక్షరటుడే, ఇందూరు:ABVP Nizamabad | బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడం కోసం ఏబీవీపీ నాయకుడు సామ జగన్మోహన్ రెడ్డి(ABVP leader Sama Jaganmohan Reddy) బలిదానం చేశాడని.. ఆయన సేవలు మరువలేనివని ఏబీవీపీ ఇందూరు విభాగ్ శశిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కవితా కాంప్లెక్స్(Kavita Complex)లో జగన్మోహన్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నక్సలిజం పేరుతో కొందరు అరాచకాలు సృష్టిస్తున్న సమయంలో జాతీయ జెండా గౌరవం కోసం జగన్మోహన్ రెడ్డి తన ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వెంకటకృష్ణ, జోనల్ ఇన్ఛార్జి దుర్గా దాస్, ప్రేమ్, వాసు, విష్ణు, సాత్విక్, ఈశ్వర్, అభినవ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.