More
    Homeబిజినెస్​NSDL IPO | రేపటి నుంచే ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీవో

    NSDL IPO | రేపటి నుంచే ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీవో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NSDL IPO | ఇన్వెస్టర్లు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న దేశంలోని ప్రముఖ డిపాజిటరీ(Depository) సంస్థ అయిన నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (National Securities Depository Limited) ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభం అవుతుంది. వచ్చేనెల 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ(NSE)లలో లిస్ట్‌ కానుంది. ఐపీవో వివరాలిలా ఉన్నాయి.

    స్టాక్‌ మార్కెట్‌నుంచి రూ. 4,011.60 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఎన్‌ఎస్‌డీఎల్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(Offer For Sale) ద్వారా 5.01 కోట్ల షేర్లను విక్రయించి ఈ మొత్తాన్ని సమీకరించనుంది. ప్రమోటర్లైన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఈ మేరకు తమ వాటాలను తగ్గించుకోనున్నాయి. డిపాజిటరీ కంపెనీలో ఏ ఒక్క సంస్థకు 15 శాతానికి మించి వాటాలు ఉండకూడదన్న సెబీ (SEBI) నిబంధనల నేపథ్యంలో ఆయా కంపెనీలు వాటాలు తగ్గించుకుంటున్నాయి.

    NSDL IPO | కంపెనీ పనితీరు..

    ఎన్‌ఎస్‌డీఎల్‌ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,365 కోట్ల రెవెన్యూ(Revenue) ద్వారా రూ. 275 కోట్ల నికర లాభాలను సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,535 కోట్ల రెవెన్యూతో లాభాలను రూ. 343 కోట్లకు పెంచుకుంది. ఇదే సమయంలో సంస్థ ఆస్తులు రూ. 2,257 కోట్లనుంచి రూ. 2,984 కోట్లుకు పెరిగాయి.

    NSDL IPO | ధరల శ్రేణి..

    ఒక్కో షేరుకు ప్రైస్‌ బాండ్‌(Price band)ను రూ. 760 నుంచి రూ. 800గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 18 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 18 షేర్లకోసం అప్పర్‌ ప్రైస్‌ బాండ్‌ వద్ద రూ. 14,400తో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎంప్లాయిస్‌కు ఒక్కో షేరుకు రూ. 76 డిస్కౌంట్‌ ప్రకటించింది.

    NSDL IPO | కోటా, జీఎంపీ..

    క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు ప్రస్తుతం గ్రే మార్కెట్‌ ప్రీమియం రూ. 135 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 17 శాతం వరకు లాభం వచ్చే అవకాశం ఉంది.

    NSDL IPO | ఐపీవో వివరాలు..

    యాంకర్‌ ఇన్వెస్టర్లకు మంగళవారమే బిడ్డింగ్‌ విండో తెరుచుకుంది. రిటైల్‌, క్యూఐబీ, ఎన్‌ఐఐలకు సబ్‌స్క్రిప్షన్‌(Subscription) విండో బుధవారం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1తో పబ్లిక్‌ ఇష్యూ దరఖాస్తు గడువు ముగుస్తుంది. 4న రాత్రి ఐపీవో అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 6న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

    More like this

    Nizamabad | భారీగా అల్ప్రాజోలం పట్టివేత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు...

    Bathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025 పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు!

    అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma Young Filmmakers’ Challenge | తెలంగాణ‌లోని యువ కంటెంట్ క్రియేటర్లకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్...

    IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)​లను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది. నలుగురు...