అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | భారత్, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండడం, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(FII) పెట్టుబడులను ఉపసంహరిస్తుండడం, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలో పయనిస్తుండడంతో మన మార్కెట్లూ ఒత్తిడికి గురవుతున్నాయి. మంగళవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 271 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 71 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 80,575 నుంచి 80,990 పాయింట్ల మధ్య, నిఫ్టీ 24,598 నుంచి 24,727 పాయింట్ల మధ్య కదలాడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 73 పాయింట్ల నష్టంతో 80,817 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 24,669 వద్ద కదలాడుతున్నాయి.
Stock Market | మిక్స్‌డ్‌గా సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market)లోని సూచీలు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్(realty index) 0.82 శాతం పెరగ్గా.. టెలికాం ఇండెక్స్ 0.67 శాతం, కమోడిటీ 0.44 శాతం, హెల్త్‌కేర్ 0.40 శాతం, మెటల్ 0.38 శాతం, ఎనర్జీ 0.37 శాతం లాభాలతో ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.95 శాతం నష్టాలతో ఉండగా.. ఐటీ(IT) 0.60 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.54 శాతం, బ్యాంకెక్స్ 0.27 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.25 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.04 శాతం లాభంతో ఉండగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం నష్టంతో ఉన్నాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు నష్టాలతో ఉండగా.. 13 కంపెనీలు లాభాలతో ఉన్నాయి.
ఎయిర్‌టెల్ 1.29 శాతం, టాటా మోటార్స్ (Tata Motors) 0.84 శాతం, ఎల్‌అండ్‌టీ 0.81 శాతం, రిలయన్స్ 0.52 శాతం, అదానిపోర్ట్స్ 0.48 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Stock Market | Top losers..
బీఈఎల్ 1.91 శాతం, ఎటర్నల్ 1.45 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.31 శాతం, టీసీఎస్ ఒక శాతం, టైటాన్ 0.74 శాతం నష్టాలతో ఉన్నాయి.