ePaper
More
    HomeతెలంగాణNagarjuna Sagar | నాగార్జున సాగర్​కు భారీగా వరద.. తెరుచుకున్న గేట్లు

    Nagarjuna Sagar | నాగార్జున సాగర్​కు భారీగా వరద.. తెరుచుకున్న గేట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Nagarjuna Sagar | ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది (Krishna River) పరవళ్లు తొక్కుతోంది. దీంతో నాగార్జున సాగర్​కు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్​ నిండుకుండలా మారడంతో మంత్రులు ఉత్తమ్ ​కుమార్​రెడ్డి (Uttam Kumar Reddy),  అడ్లూరి లక్ష్మణ్​కుమార్ (Adluri Laxman Kumar)​ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.6 అడుగులకు నీరు చేరింది. ఎగువన నుంచి 2,01,743 క్యూసెక్కులు ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో మంగళవారం ఉదయం 11:30 గంటలకు మంత్రులు, నాగర్జున సాగర్​ ఎమ్మెల్యే రఘువీర్​రెడ్డి కృష్ణమ్మ హారతి ఇచ్చి గేట్లు ఎత్తారు.

    Nagarjuna Sagar | 18 ఏళ్ల తర్వాత..

    ప్రస్తుతం కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. దీంతో ఆ నదిపై గల జూరాల (Jurala), శ్రీశైలం(Srisailam), నాగార్జున సాగర్​ నిండుకుండల్లా మారాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. నాగర్జున సాగర్​ దిగువన గల పులిచింతల ప్రాజెక్ట్​ కూడా వరద ఇలాగే కొనసాగితే రెండు, మూడు రోజుల్లో నిండే అవకాశం ఉంది. అయితే జులైలో నాగార్జున సాగర్​ గేట్లు ఎత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దిగువకు నీటిని వదలడంతో నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉందడాలని అధికారులు సూచించారు.

    READ ALSO  Krishna River | కృష్ణానదికి భారీగా వరద.. అన్ని ప్రాజెక్ట్​ల గేట్లు ఓపెన్​

    Nagarjuna Sagar | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​లోకి 2,39,601 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 2,28,900 క్యూసెక్కుల ఔట్​ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 883 అడుగుల(204.7 టీఎంసీలు)కు నీరు చేరింది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this