ePaper
More
    HomeసినిమాActress Kalpika Ganesh | మ‌ళ్లీ ర‌చ్చ చేసిన న‌టి క‌ల్పిక‌.. బూతు పురాణంతో నానా...

    Actress Kalpika Ganesh | మ‌ళ్లీ ర‌చ్చ చేసిన న‌టి క‌ల్పిక‌.. బూతు పురాణంతో నానా హంగామా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Actress Kalpika Ganesh | సినిమాలు, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన నటి కల్పిక గణేష్ (Actress Kalpika Ganesh) మరోసారి వివాదంలో నిలిచింది. హైదరాబాద్ (Hyderabad) సమీపంలోని మొయినాబాద్- కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) చర్చనీయాంశంగా మారింది.

    సోమవారం మధ్యాహ్నం క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, రిసెప్షన్ వద్దే సిబ్బందిపై గొడవకు దిగారు. మేనేజర్ కృష్ణపై బూతుల వర్షం కురిపించడంతోపాటు, మెనూ కార్డు విసిరేయడం, తాళాలను ప‌డేయ‌డం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆమె ప్రవర్తనకు అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ హంగామా కొనసాగింది.

    READ ALSO  Director Krish | హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకోవడంపై తొలిసారి స్పందించిన క్రిష్‌..

    Actress Kalpika Ganesh | ఇప్పుడు కొత్త వివాదం..

    ఈ ఘటనపై కల్పిక స్పందిస్తూ, రిసార్ట్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబ్ సదుపాయం లేకపోవడం, వైఫై పనిచేయకపోవడం, సిగరెట్ తీసుకురావాలని అడిగినా పట్టించుకోకపోవడం నన్ను ఇబ్బందికి గురితీసిందని తెలిపారు.

    “కస్టమర్‌గా వెళ్లినా కనీస గౌరవం లేదంటే బాధపడడం సహజం. అందుకే అలా స్పందించాల్సి వచ్చింది అంటూ ఆమె పేర్కొన్నారు. కల్పిక రిసార్ట్ సిబ్బందితో జరిగిన మాటల యుద్ధాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేశారు. అయితే, ఆమె మాటలు నెటిజన్లకు అంతగా నచ్చలేదు. “నీకు ఏదో మానసిక సమస్య ఉన్నట్లు ఉంది”, “ఊరికే గొడవలు చేసుకోవడం నీకు అలవాటేమో”, “ఇంట్లో ఉండడం బెటర్” అంటూ ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తాయి.

    READ ALSO  Nalgonda | ప్రియుడి కోసం కన్న కొడుకును బస్టాండ్​లో వదిలేసిన తల్లి

    ఇది కల్పిక గణేష్‌కు సంబంధించిన తొలి వివాదం కాదు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌ ప్రిజమ్ పబ్‌లో (Hyderabad Prism Pub) జరిగిన ఘర్షణ తర్వాత ఆమెపై కేసు కూడా నమోదైంది. అక్కడ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆమె ప్లేట్లు విసిరినట్లు, బాడీ షేమింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కూడా వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుడు ఆమె .. పబ్ సిబ్బంది తన్ను డ్రగ్ అడిక్ట్‌గా అభివర్ణించడం, అవమానించడమే గొడవకు కారణమైంది అని వివరణ ఇచ్చారు. ఇలా వరుసగా పబ్‌, రిసార్ట్‌లలో కల్పిక ప్రవర్తనపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె మానసికంగా సమస్యల్లో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమె ప్రవర్తనను “పబ్లిసిటీ స్టంట్”గా అభివర్ణిస్తున్నారు.

    READ ALSO  Minister Rammohan Naidu dance | బంధువుల పెళ్లిలో అద్దిరిపోయే డ్యాన్స్ చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. వీడియో వైర‌ల్

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 1 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    child marriage | 13 ఏళ్ల బాలిక మెడలో తాళి కట్టిన 40 ఏళ్ల వ్యక్తి.. హైదరాబాద్​కు కూతవేటు దూరంలోనే ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

    అక్షరటుడే, హైదరాబాద్: child marriage : బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో...

    HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association - HCA) భారీ కుదుపునకు గురైంది. HCA...

    Anil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​

    అక్షరటుడే, ఇందూరు: Anil Eravatri : వీర్ సావర్కర్ పదేళ్లు జైళ్లో ఉన్నా.. దేశానికి అవసరమైన సమయంలో మాత్రం...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 1 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    child marriage | 13 ఏళ్ల బాలిక మెడలో తాళి కట్టిన 40 ఏళ్ల వ్యక్తి.. హైదరాబాద్​కు కూతవేటు దూరంలోనే ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

    అక్షరటుడే, హైదరాబాద్: child marriage : బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో...

    HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association - HCA) భారీ కుదుపునకు గురైంది. HCA...