ePaper
More
    HomeజాతీయంRains in Delhi | ఢిల్లీలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ

    Rains in Delhi | ఢిల్లీలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rains in Delhi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలోని చాల ప్రాంతాల్లో కుండ పోత వాన (Heavy Rain) కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్​ జామ్​ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

    ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ (Red Alert) జారీ చేసింది. మధ్యాహ్నం వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటలకు 30–40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంగళవారం ఐటీవో, ధౌలా కువాన్, నరైనా, పటేల్ నగర్, విజయ్ చౌక్, జంగ్పురా, రోహిణి వంటి ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.

    READ ALSO  cryptocurrency scam | మరో సైబర్​ మోసం.. రూ.384 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కామ్‌..!

    వర్షాలతో ఢిల్లీలో విమానాల (Flights) రాకపోకలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఎయిర్​లైన్​ సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు ఎయిర్​ ఇండియా (Air India), ఇండిగో (Indigo) ప్రయాణికులకు సూచనలు చేశాయి. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఇంట్లో నుంచి వెళ్లే ముందు ప్రయాణికులు విమాన స్థితి గురించి తెలుసుకోవాలని సూచించాయి.

    Rains in Delhi | ఉత్తరాదిలో వర్ష బీభత్సం

    ఢిల్లీలో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో మంగళవారం భారీ వాన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రాజస్థాన్​లోని పలు జిల్లాలకు సైతం వాతావరణ శాఖ అధికారులు రెడ్​ అలెర్ట్​ జారీ చేశారు. ఇటీవల రాజస్థాన్​లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జన జీవనం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు పడే అవకాశం అధికారులు తెలిపారు. ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేశారు.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this