అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal congress | కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను (Minakshi natarajan) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (Mla thota lakshmi kantha rao) నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచనల మేరకు.. కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మండల నాయకులు ఎన్ఆర్ఐ భుజంగారి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువ నాయకులు సాయి పటేల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి లోకల్ బాడీ ఎన్నికలు, జుక్కల్ అభివృద్ధిపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అంతేకాకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ జరిగింది. బీసీ వర్గాల సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, వారికి రాజకీయంగా ప్రాతినిధ్యం కలిగించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు.
Jukkal congress | కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో జుక్కల్ నాయకుల భేటీ
Published on
