Nimisha Priya
Indian nurse | భార‌త నర్సుకి ఉరిశిక్ష ర‌ద్దు.. ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న కీల‌క‌ నిర్ణయం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nimisha Priya : యెమెన్‌(Yemen) లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష నుంచి ఉపశమనం లభించింది. కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు మ‌త పెద్ద‌లు చేసిన ప్ర‌య‌త్నాల‌తో ఆమె మరణశిక్ష శాశ్వతంగా రద్దయింది.

ఈ విషయాన్ని భారత గ్రాండ్ ముఫ్తీ (Grand Mufti of India), కాంతపురం(Kanthapuram) AP అబుబక్కర్ ముస్లయ్యర్ (Abu Bakr Musliyar) కార్యాలయం వెల్లడించింది. గతంలో, యెమెన్‌లోని అధికారులు దౌత్యపరమైన జోక్యం తర్వాత ప్రియా ఉరిశిక్షను వాయిదా వేశారు.

“గతంలో సస్పెండ్ చేయబడిన నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేశారు. సనా(Sanaa)లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తాత్కాలికంగా గతంలో సస్పెండ్ చేయబడిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు” అని గ్రాండ్ ముఫ్తీ ప్ర‌క‌టించింది.

Nimisha Priya : ఫ‌లించిన దౌత్యం

హత్య కేసులో దోషిగా తేలిన నిమిషా ప్రియ‌కు ఉరి తీయాల‌ని ఈ నెల 16న ముహూర్తం ఖ‌రారు చేశారు. అయితే, భారత ప్రభుత్వం. గ్రాండ్ ముఫ్తీ అబూ బకర్ అహ్మద్‌తో సహా అనేక మంది మత నాయకులు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు.

ఫ‌లితంగా యెమెన్‌లోని హౌతీ అధికారులు ఇంతకుముందు శిక్షను సస్పెండ్ చేశారు. ఇప్పుడు దానిని అధికారికంగా రద్దు చేశారు. దీంతో నిమిషాకు పునర్జ‌న్మ ల‌భించిన‌ట్ల‌యింది. ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు అయిన షేక్ అబూ బకర్ అహ్మద్‌కు షరియా చట్టంపై లోతైన విష‌య ప‌రిజ్ఞానం ఉంది.

“గ్రాండ్ ముఫ్తీ” అనే బిరుదు భారతదేశంలో అనధికారికంగా ఉన్నప్పటికీ, ఆయనను భారతదేశంలోని సున్నీ ముస్లిం సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు. రియు తరచుగా భారతదేశ 10వ గ్రాండ్ ముఫ్తీ అని పిలుస్తారు. ఆయ‌న‌తో పాటు కేంద్రం చేసిన దౌత్య ప్ర‌య‌త్నాలు ఎట్ట‌కేల‌కు ఫ‌లించి ఉరిశిక్ష ర‌ద్ద‌యింది.

Nimisha Priya : హ‌త్య కేసులో ఇరుక్కుని..

కేర‌ళ‌ Kerala కు చెందిన నిమిషాప్రియ హ‌త్య కేసు క‌థ 2018లో ఆమెకు 18 సంవత్సరాల వయసు ఉన్న‌ప్పుడు ప్రారంభమైంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నిమిషా తన నర్సింగ్ విద్యను పూర్తి చేసింది. స్థానికంగా ఉద్యోగం దొర‌క‌క‌పోవ‌డంతో ఆమె యెమెన్‌లో అవకాశాల గురించి తెలుసుకుని అక్క‌డ‌కు వెళ్లింది.

19 సంవత్సరాల వయసులో, ఆమె యెమెన్‌కు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిలో చేరింది. కొంతకాలం కేరళకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఒక ఆటో డ్రైవర్‌ను వివాహం చేసుకుంది. ఇద్ద‌రు క‌లిసి యెమెన్‌కు వెళ్లి అక్క‌డ ప‌ని చేసుకుంటున్నారు. వారికి ఓ పాప జ‌న్మించింది.

యెమెన్‌లో ఆర్థిక ఇబ్బందులు, అశాంతి కారణంగా ఆమె భర్త, కుమార్తెతో ఇండియాకు తిరిగి వచ్చాడు. అయితే, నిమిషా సొంతంగా క్లినిక్‌ను ప్రారంభించాల‌ని భావించింది. యెమెన్ చట్టం ప్రకారం విదేశీ పౌరులు స్థానిక పౌరుడితో భాగస్వామ్యం కలిగి ఉంటేనే వ్యాపారాన్ని ప్రారంభించాలి.

దీంతో ఆమె నర్సుగా పనిచేస్తున్నప్పుడు కలిసిన యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మహదీ భాగ‌స్వామ్యంతో 2015లో క్లినిక్ నెల‌కొల్పింది. అయితే, నిమిషా అవ‌స‌రాల‌ను గుర్తించిన అత‌డు ఆమెను ర‌క‌ర‌కాలుగా ఇబ్బందులు పెట్టాడు. పాస్‌పోర్టు కూడా స్వాధీనం చేసుకున్నాడు.

అత‌డి వేధింపులు తాళ‌లేక నిమిషా ప్రియ మ‌హ‌దీకి మత్తు ఇంజెక్ష‌న్ చేసి, పాస్‌పోర్టు తీసుకుని పారిపోవాల‌ని య‌త్నించింది. అయితే, డోస్ ఎక్కువ కావ‌డంతో అత‌డు మృతి చెందాడు. దీంతో మృత‌దేహాన్ని ముక్కలు చేసి, నీటి ట్యాంక్‌లో ప‌డేసింది. ఆమె పారిపోతుండ‌గా, సౌదీ అరేబియా స‌రిహ‌ద్దులో అరెస్టు చేశారు. 2024లో అక్క‌డి కోర్టు మరణశిక్ష విధించబడింది. ఈ నెల 16న ఉరితీసేందుకు నిర్ణ‌యించ‌గా, భార‌త దౌత్యంతో ఆగిపోయింది. ఇప్పుడు శాశ్వ‌తంగా ర‌ద్దు చేయ‌బ‌డింది.