అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం, వెండి ధరలలో రోజువారీ మార్పులు సహజమే. కొన్నిసార్లు ధరలు పెరిగితే, మరికొన్నిసార్లు తక్కువ అవుతుంటాయి. మొన్నటి వరకు పైపైకి వెళ్లిన బంగారం ధరలు.. ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటన మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు కొంత మేరకు తగ్గాయి.
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర (Gold rates).. 99,920 కాగా, 22 క్యారెట్లు రూ.91,590గా ట్రేడ్ అయింది. ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,07,000కు తగ్గింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,740 వద్ద కొనసాగుతోంది. IBJA నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు) రూ. 99,920 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు) రూ.91,590గా ట్రేడ్ అయింది.
Today Gold Price : తగ్గుతున్న ధరలు..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. ముంబై, చెన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర.. 99,920 (10 గ్రాములు) కాగా, 22 క్యారెట్లు రూ.91,590 (10 గ్రాములు)గా ట్రేడ్ అయింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో వెండి Silver ధర రూ. 1,15,900 వద్ద ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఇది రూ. 1,25,000 వరకు చేరుకుంది. బంగారం, వెండి ధరల తగ్గుదలకు అనేక దేశీయ, అంతర్జాతీయ అంశాలు కారణంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా వాణిజ్య విధానాలు. అమెరికా ప్రభుత్వం ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేస్తుండడంతో పెట్టుబడిదారుల ధోరణి మారుతోంది.
కేంద్ర బ్యాంకుల పాలసీలు కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ వోలాటిలిటీ కూడా ఒక కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత వలన బంగారం లాంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ మారుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం వలన బంగారం పెట్టుబడిదారులకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. దీని విలువ భద్రంగా ఉండడంతో, మార్కెట్‌లో గందరగోళం ఉన్నా కూడా బంగారంపై పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు.