More
    Homeబిజినెస్​Pre Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్‌ క్యూస్‌.. నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్‌

    Pre Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్‌ క్యూస్‌.. నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్‌

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌ మినహా మిగిలిన గ్లోబల్‌ మార్కెట్లు(Global market) నష్టాలతో ఉన్నాయి. వాణిజ్య ఒప్పందాల విషయంలో ఆందోళనతో యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు సైతం నెగెటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    ట్రేడ్‌ డీల్స్‌తో వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతోంది. ఎస్‌అండ్‌పీ వరుసగా ఆరో సెషన్‌లోనూ ఆల్‌టైం హై రికార్డును సవరించింది. నాస్‌డాక్‌(Nasdaq) సైతం రికార్డు స్థాయి గరిష్టాల వద్ద కొనసాగుతోంది. సోమవారం నాస్‌డాక్‌ 0.33 శాతం, ఎస్‌అండ్‌పీ 0.02 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.07 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    యూఎస్‌, ఈయూల మధ్య వాణిజ్య ఒప్పందం(Trade deal) కుదిరిన నేపథ్యంలో యూరోప్‌లో ఆందోళన నెలకొంది. ఈ ఒప్పందం ఆదర్శవంతంగా లేదని డచ్‌ విదేశాంగ వాణిజ్య మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యూరోప్‌ మార్కెట్లు నెగెటివ్‌గా స్పందించాయి. డీఏఎక్స్‌ 1.03 శాతం, సీఏసీ 0.43 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.43 శాతం నష్టపోయాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం మంగళవారం ఉదయం నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8.00 గంటల సమయంలో కోస్పీ(Kospi) 0.20 శాతం లాభాలతో ఉండగా.. హంగ్‌సెంగ్‌ 1.21 శాతం, నిక్కీ 0.92 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.80 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.56 శాతం, షాంఘై 0.09 శాతం నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.19 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. నికరంగా రూ. 6,082 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐ(DII)లు వరుసగా 16వ ట్రేడింగ్ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నికరంగా రూ. 6,764 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.7 నుంచి 0.64 కు తగ్గింది. విక్స్‌(VIX) 6.98 శాతం పెరిగి 12.06కు చేరింది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 70.08 డాలర్ల వద్ద ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి రష్యాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump) ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.
    • క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు బలహీనపడి 86.66 వద్ద నిలిచింది.

    యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.41 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.59 వద్ద కొనసాగుతున్నాయి.
    అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం బుధవారం జరగనుంది. వడ్డీ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించవచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు యూఎస్‌, చైనాల మధ్య వాణిజ్య చర్చల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి.

    More like this

    Nizamabad | భారీగా అల్ప్రాజోలం పట్టివేత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు...

    Bathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025 పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు!

    అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma Young Filmmakers’ Challenge | తెలంగాణ‌లోని యువ కంటెంట్ క్రియేటర్లకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్...

    IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)​లను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది. నలుగురు...