- Advertisement -
HomeతెలంగాణEx Minister Srinivas Goud | గుడిలో నుంచి గౌడ కులస్థులను వెళ్లగొట్టడం బాధాకరం

Ex Minister Srinivas Goud | గుడిలో నుంచి గౌడ కులస్థులను వెళ్లగొట్టడం బాధాకరం

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Farmer MLA Srinivas Goud | శ్రీరామనవమి (Srirama navami) రోజు గుడికి వచ్చిన గౌడ కులస్థులను వీడీసీలు వెళ్లగొట్టడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Former Minister Srinivas Goud) అన్నారు. పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీల దురాగతాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ గార్డెన్ (MR Garden)నుంచి ర్యాలీగా అంబేడ్కర్​ చౌరస్తా (Ambedkar chowrastha) వరకు వచ్చి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కులవృత్తులపై గ్రామభివృద్ధి కమిటీల దాడులను తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షుడు నరసింహాచారి, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్, యదాగౌడ్, ప్రభాకర్, గంగాధర్, దత్తాద్రి, రాజుల దేవి రవినాథ్, బట్టు నరేందర్, శంకర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News