ePaper
More
    Homeక్రైంCyber Crime | కొత్త రకం సైబర్​ మోసం.. ఫిక్స్​డ్​ డిపాజిట్లనూ వదలడం లేదు..!

    Cyber Crime | కొత్త రకం సైబర్​ మోసం.. ఫిక్స్​డ్​ డిపాజిట్లనూ వదలడం లేదు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime | సైబర్​ నేరస్తులు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకు కొత్త మార్గాల్లో ప్రజల ఖాతాల్లో నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఖాతాల్లో డబ్బులు కాజేసిన సైబర్​ నేరగాళ్లు ప్రస్తుతం క్రెడిట్​ కార్డుల్లో నగదు కూడా తీసుకుంటున్నారు. అంతేగాకుండా ఫిక్స్​డ్​ డిపాజిట్ల (Fixed Deposits)ను క్యాన్సిల్​ చేసి ఆ డబ్బును సైతం మాయం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని ఓ యువకుడి ఖాతాలో నుంచి రూ.7 లక్షలు కాజేశారు.

    సికింద్రాబాద్​లోని తార్నాక (Tarnaka)కు చెందిన ఓ యువకుడి(27)కి జులై 25న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేశాడు. తాము బ్యాంకు నుంచి ఫోన్​ చేసినట్లు చెప్పాడు. ఫిక్స్​డ్​ డిపాజిట్ల ఆటో రెన్యూవల్ అవతలి వ్యక్తి చెబుతున్నాడు. ఈ సమయంలో లింక్​తో కూడిన ఎస్​ఎంఎస్​ బాధితుడి నంబర్​కు వచ్చింది. అనంతరం imobilete.apk అనే ప్రమాదకరమైన యాప్ ఫోన్​లో డౌన్​లోడ్​ అయింది.

    READ ALSO  ACB Trap | రూ.ఐదు లక్షల లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్​

    Cyber Crime | రూ.7 లక్షలు మాయం

    ఫోన్​లో యాప్​ డౌన్​లోడ్​ అయిన తర్వాత బాధితుడి అనుమతి లేకుండానే.. సైబర్​ నేరగాళ్లు ఫోన్​ను యాక్సెస్​ చేయడం ప్రారంభించారు. అంతేగాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లు మూసివేశారు. ఆ నగదును వారు బదిలీ చేసుకున్నారు. క్రెడిట్​ కార్డుల నుంచి సైతం నగదు ట్రాన్స్​ఫర్​ చేసుకున్నారు. ఇలా మొత్తం రూ.7,05,049 సైబర్​ నేరగాళ్లు కొట్టేశారు. ఖాతాలో డబ్బులు కట్​ కావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసుల (Cyber Crime Police)కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Cyber Crime | అప్రమత్తంగా ఉండాలి

    సైబర్​ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్​లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్​ చేసి తాము పోలీసులం, సీబీఐ ​ అధికారులమని(CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు చెప్పొద్దని, ఏపీకే ఫైళ్లు డౌన్​లోడ్​ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ సైబర్​ నేరానికి గురైతే.. వెంటనే 1930 నంబర్​కు ఫోన్​ చేయాలని కోరారు.

    READ ALSO  Fake Certificates | నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 1 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    child marriage | 13 ఏళ్ల బాలిక మెడలో తాళి కట్టిన 40 ఏళ్ల వ్యక్తి.. హైదరాబాద్​కు కూతవేటు దూరంలోనే ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

    అక్షరటుడే, హైదరాబాద్: child marriage : బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో...

    HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association - HCA) భారీ కుదుపునకు గురైంది. HCA...

    Anil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​

    అక్షరటుడే, ఇందూరు: Anil Eravatri : వీర్ సావర్కర్ పదేళ్లు జైళ్లో ఉన్నా.. దేశానికి అవసరమైన సమయంలో మాత్రం...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 1 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    child marriage | 13 ఏళ్ల బాలిక మెడలో తాళి కట్టిన 40 ఏళ్ల వ్యక్తి.. హైదరాబాద్​కు కూతవేటు దూరంలోనే ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

    అక్షరటుడే, హైదరాబాద్: child marriage : బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో...

    HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association - HCA) భారీ కుదుపునకు గురైంది. HCA...