అక్షరటుడే, ఆర్మూర్: Alumni reunion | పట్టణంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల (Kshatriya College of Engineering) పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. కళాశాలకు చెందిన ఎంసీఏ (MCA) 2007–2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోమవారం కార్యక్రమం నిర్వహించారు.
Alumni reunion | స్నేహితులంతా ఒక్కచోట చేరి..
కార్యక్రమంలో భాగంగా స్నేహితులంతా ఒక్కచోట చేరి.. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ (Kshatriya College Chairman Aljapur Srinivas), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేందర్, పూర్వ విద్యార్థులు సునీల్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.